కాబోయే కోడలు సమంత గురించి నాగార్జున ట్వీట్ రారండోయ్ వేడుక చూద్దాం ట్రైలర్ ఇటీవలే విడుదల ట్రైలర్ లో ఆయన తెగ నచ్చారని మామా నాగ్ తో చెప్పిన సమంత

అక్కినేని ఫ్యామిలీలో మామా కోడళ్ల మధ్య ఉండే అనుబంధం తండ్రీ కూతుళ్ల లా ఉంటుందని కింగ్ నాగార్జున నిరూపించారు. తన కాబోయే కోడలు, నాగ చైతన్య వివాహం చేసుకోనున్న సమంత ఇటీవలే విడుదలైన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ట్రైలర్ చూసి నాగార్జునకు ఫోన్ లో వాట్సాప్ చేసిందట. ఆ ఫోన్లో సమంత పెట్టిన సంభాషణల విశేషాలను అభిమానులతో పంచుకున్నారు నాగార్జున.

నాగచైతన్య కథానాయకుడుగా నటించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ‘అమ్మాయి మనశ్శాంతికి హానికరం’ అంటూ వచ్చిన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని నాగార్జున తాజాగా ట్వీట్‌ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు తనకు కాబోయే కోడలు సమంత ఈ ట్రైలర్ పై స్పందించింది. ట్రైలర్‌పై ఆమె స్పందన ఇదంటూ.. వాట్సాప్ లో చేసిన చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌ను నాగార్జున పోస్ట్‌ చేశారు.

ట్రైలర్‌ చాలా నచ్చిందని, ఆయన(నాగచైతన్య) చాలా బావున్నారని సమంత తన సందేశంలో పేర్కొన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Scroll to load tweet…