చిరంజీవి పాత్రలో నాగ్..!

Nagarjuna to play don role in devadas
Highlights

మున్నాభాయ్ అంటే సంజ‌య్‌ద‌త్ గుర్తొస్తాడు. శంక‌ర్‌దాదా అంటే మెగాస్టార్ మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున కూడా ఫేమ‌స్ కావాల‌నుకుంటున్నాడు.

మున్నాభాయ్ అంటే సంజ‌య్‌ద‌త్ గుర్తొస్తాడు. శంక‌ర్‌దాదా అంటే మెగాస్టార్ మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున కూడా ఫేమ‌స్ కావాల‌నుకుంటున్నాడు. అందుకే కొత్తగా డాన్ క్యారెక్ట‌ర్‌లో దాదాగిరి చేస్తున్నాడు. మ‌రో విధంగా చెప్పాలంటే నాగార్జున హీరోగా శంక‌ర్‌దాదా సిరీస్‌లో మూడో చిత్రం రాబోతుంద‌న్న‌మాట‌.

ఇక అస‌లు విషయానికొస్తే.. దేవదాసు.. ఈ టైటిల్‌తో ఇండియ‌న్ సినిమాకు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. నాగేశ్వ‌ర‌రావు, సావ‌త్రి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన దేవ‌దాసు ఆల్‌టైమ్ క్లాసిక్‌గా వెలుగుతున్న విష‌యం తెలిసిందే. రామ్‌టైటిల్ ఎంట్రీ దేవ‌దాసు అనే టైటిల్‌తోనే జ‌రిగింది. ఇక బాలీవుడ్ విష‌యానికొస్తే.. దేవ‌దాసు క‌థ‌ను నేప‌థ్యంగా చేసుకుని చాలా చిత్రాలే తెర‌కెక్కాయి. సంజ‌య్ లీలా బ‌న్సాలి తెర‌కెక్కించిన దేవ‌దాసు విజువ‌ల్ వండ‌ర్‌గా షారుఖ్ ఖాన్ కెరీర్‌లో గొప్ప చిత్రంగా నిలిచిన విష‌యం తెలిసిందే.

దేవ‌దాస్‌లాంటి క్లాసిక్ టైటిల్‌తో యంగ్ డైరెక్ట‌ర్స్ కొత్త చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం సాహ‌స‌మ‌నే చెప్పాలి. అయితే, డైరెక్ట‌ర్ ఆదిత్య శ్రీ‌రామ్ మాత్రం కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని అండ‌తో టైటిట్ ను జ‌స్టిఫై చేస్తానంటున్నాడు. గ‌తంలో ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన భ‌లే మంచి రోజు, శ‌మంత‌క‌మ‌ణి చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాను తెర‌కెక్కించ‌బోయే దేవ‌దాసు కూడా మెప్పిస్తుంద‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

loader