Asianet News TeluguAsianet News Telugu

Big Boss Telugu 5: హౌజ్‌ నుంచి వెళ్లిపొమ్మంటూ షణ్ముఖ్‌, సిరిలకు ఊహించని షాకిచ్చిన నాగ్‌ .. సన్నీనే విన్నర్‌

శనివారం ఎపిసోడ్‌ ఎవిక్షన్‌ పాస్‌ లభించే గేమ్‌ కంటిన్యూ అయ్యింది. ఫైనల్‌గా, నిన్నటి ఎపిసోడ్‌కి కొనసాగింపుగా మానస్‌, కాజల్‌ ఫైర్‌ ఇంజిన్‌లో ఉండే ఎదురుగా అనీ మాస్టర్, సిరిలలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో నిర్ణయించలేకపోయారు. 

nagarjuna strong warning to siri shanmukh and manas and finally sunny winner
Author
Hyderabad, First Published Nov 20, 2021, 11:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Big Boss Telugu 5) శనివారం 76వ ఎపిసోడ్‌ ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. శనివారం అంటే హోస్ట్ నాగార్జున(Nagarjuna) వస్తాడు. ఇంటి సభ్యులకు క్లాస్‌ పీకడాలు, సరదాగా గేమ్‌ ఆడటాలు చేస్తుంటాడు. ఈ రోజు కూడా నాగార్జున హౌజ్‌ మేట్స్ కి బాగానే క్లాస్‌ పీకాడు. ముఖ్యంగా హౌజ్‌లో ప్రేమ పక్షులుగా మారిపోయిన షణ్ముఖ్‌, సిరిలను పర్సనల్‌గా హౌజ్‌లోకి పిలిపించి మరీ క్లాస్ పీకాడు నాగార్జున. మరోవైపు ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఇద్దరిని సేవ్‌ చేశాడు. 

శనివారం ఎపిసోడ్‌ ఎవిక్షన్‌ పాస్‌ లభించే గేమ్‌ కంటిన్యూ అయ్యింది. ఫైనల్‌గా, నిన్నటి ఎపిసోడ్‌కి కొనసాగింపుగా మానస్‌, కాజల్‌ ఫైర్‌ ఇంజిన్‌లో ఉండే ఎదురుగా అనీ మాస్టర్, సిరిలలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఇద్దరి ఫోటోలు కాలిపోయాయి. ఇక మిగిలింది సన్నీ మాత్రమే. ఫైనల్‌ గా ఆయనకు ఫ్రీ ఎవిక్షన్‌ పాస్‌ లభించింది. దీంతో పండగా చేసుకున్నాడు సన్నీ. తమిళ హీరో విజయ్‌ సినిమా పాటలకు డాన్స్ వేశాడు. అయితే ఈ ఎవిక్షన్‌ పాస్‌ ఎక్కడ, ఎప్పుడు వాడాలో బిగ్‌బాస్‌ చెబుతా అన్నాడు. ఈ టాస్క్ లో ప్రియాంక, మానస్‌, కాజల్, సన్నీ కలిసి గేమ్‌ ఆడారని, నాటకాలు ఆడుతున్నారంటూ అనీ మాస్టర్‌ ఫైర్‌ అయ్యింది. హౌజ్‌లో గోల గోల చేసింది. 

అనంతరం కోల్గేట్‌ ఫ్రెష్‌ చిన్న గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. ఇందులో ఇంటి సభ్యులు ఎవరు ఫ్రెష్‌గా తమ ఆలోచనలు మార్చుకోవాలనేది చెప్పాల్సి ఉంది. ఇందులో అనీ మాస్టర్‌ పేరుని కాజల్‌, కాజల్‌ పేరుని సిరి, అనీ మాస్టర్, శ్రీరామ్‌ పేరుని మానస్‌, మానస్‌ పేరుని శ్రీరామ్‌, షణ్ముఖ్‌ పేరుని సన్నీ, సిరి పేరుని షణ్ముఖ్‌, ప్రియాంక, అనీ మాస్టర్ పేరు రవి చెప్పారు. వాళ్లు తమ ఆలోచనలు మార్చుకోవాలని తెలిపారు. 

అనంతరం నాగార్జున హౌజ్‌లోకి ఎంటర్‌ అయి ఈ వారం బాగా ఆడిన వారికి  గోల్డ్ ఇవ్వాలని, వరస్ట్ గా ఆడిన వారికి కోల్‌ ఇవ్వాలని రవికి చెప్పాడు. ఇందులో రవి మొదటగా పింకీకి, మానస్‌కి, అనీ మాస్టర్‌కి, శ్రీరామ్‌కి గోల్డ్ ముద్దలిచ్చాడు. సన్నీ, కాజల్‌, షణ్ముఖ్‌, సిరిలకు బొగ్గు ఇచ్చాడు. చివరికి తాను కూడా బొగ్గే తీసుకున్నాడు. వారికి సరైన రీజన్స్ చెప్పాడు. అయితే ఈ సందర్భంగా గత స్విమ్మింగ్‌ పూల్‌లో టీషర్ట్ వేసుకునే టాస్క్ లో ముందుగానే నిబంధనలు చెప్పాల్సి ఉందని రవికి చెప్పాడు నాగ్‌. ఆ విషయంలో సంచాలకుడిగా నువ్వు మిస్టేక్‌ చేసినట్టు తెలిపారు. అదే సందర్భంలో మానస్‌ సరిగ్గా వేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు సరిగా వేసుకోలేదంటూ సన్నీని కూడా ఏకేశాడు నాగ్‌. 

అనంతరం సిరి(Siri)కి, షణ్ముఖ్‌(Shanmukh)కి పెద్ద షాక్‌ ఇచ్చాడు. హౌజ్‌ నుంచి వెళ్లిపోమ్మంటూ గేట్స్ ఓపెన్‌ చేయించాడు. పవర్‌ రూమ్‌లోకి పిలిచి క్లాస్‌ పీకాడు. షణ్ముఖతో గొడవ పడి బాత్‌రూమ్‌లో బాదుకోవడాన్ని ప్రస్తావించాడు నాగార్జున. తన స్టోరీ తనకు తెలుసు అని, కానీ హౌజ్‌లో తెలియకుండానే కనెక్షన్‌ వస్తుందని చెప్పింది. తల బాదుకోవడం ఆ సమయంలో ఆవేశానికి గురై చేసినని చెప్పింది. కానీ ఇకపై అలా చేయకూడదని, చేస్తే డైరెక్ట్ గా హౌజ్‌ నుంచి బయటకు పంపించేస్తా అని వార్నింగ్‌ ఇచ్చాడు నాగ్‌. 

మరోవైపు షణ్ముఖ్‌ని పిలిపించి.. సిరితో అలా చేయించడంపై ప్రశ్నించాడు. తాను మెంటల్లీ వీక్‌ అయినట్టు చెప్పాడు షణ్ముఖ్. దీప్తి గుర్తొస్తుందని చెప్పాడు. సిరి అలా ప్రవర్తించే విషయంలో తప్పు తనదే అని ఒప్పుకున్నాడు. అయితే దీప్తి విషయంలో ఇంకా ఫీల్‌ అయితే ఆమెని మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ కలిగితే ఇప్పుడే హౌజ్‌ నుంచి వెళ్లిపోవచ్చు అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. దీంతో షణ్ముఖ్ ముఖం వాడిపోయింది. ఇకపై మళ్లీ ఇలా చేయనని, ఇకపై కొత్త షణ్ముఖ్‌ని చూపిస్తానని తెలిపాడు షన్ను. 

మరోవైపు మానస్‌ని పిలిపించి ప్రియాంక విషయంలో నిలదీశాడు. పింకీ ఆడుతుందని కానీ తనపై ఫీలింగ్స్ ని పెంచుకుంటుందని తెలిపాడు మానస్‌. గేమ్‌ ఆడకుండా తనపై కాన్‌సన్‌ట్రేషన్‌ పెడుతుందని, అది ఇబ్బందిగా ఉందని తెలిపాడు. ఆ విషయాన్ని ఆమెకి చెబుతున్నానని, కానీ ఆమె వినడం లేదన్నాడు. గట్టిగా చెబితే హర్ట్ అయి ఏమైనా చేసుకుంటుందేమో అని భయంగా ఉందని అందుకే చెప్పలేకపోతున్నట్టు తెలిపాడు మానస్‌. అయితే దీన్ని పెంచుకుంటూ పోతే అది మరింత దూరం వెళ్తుందని, ఇప్పుడే దాన్ని క్లీయర్‌ చేసుకో అని నాగార్జున తెలిపాడు. కాజల్‌ని ఇమిటేట్‌ చేసే విషయంలో అనీ మాస్టర్ కి కూడా గట్టిగానే ఇచ్చాడు నాగ్‌. 

నామినేషన్‌లో ఉన్న ఎనిమిది సభ్యుల్లో ఇద్దరిని సేవ్‌ చేశారు. మొదటి దశలో శ్రీరామ్‌ సేవ్‌ అయ్యాడు. రెండో సారి టీషర్ట్ ఓపెన్‌ చేసి సన్నీని సేవ్‌ చేశాడు. ఆ తర్వాత ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ని సన్నీకి ఇస్తున్నట్టు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపారు. దీన్ని సన్నీగానీ, సన్నీకి నచ్చిన వాళ్లు ఎవరైనా ఎలిమినేట్‌ అవుతున్నారనుకుంటే ఆ సమయంలో ఈ పాస్ ని ఉపయోగించవచ్చు అని తెలిపారు నాగార్జున. ప్రస్తుతం నామినేషన్‌లో రవి, మానస్‌, పింకీ, కాజల్‌, షణ్ముఖ్‌, సిరి ఉన్నారు. వీరిలో రేపు ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. 

also read: Bigg Boss Telugu 5: సిరితో షణ్ముఖ్‌ ఫ్రెండ్‌షిప్‌ ప్రేమగా మారుతుందా? మానస్‌ కెప్టెన్‌.. ఫైనల్‌కి సన్నీ?

Follow Us:
Download App:
  • android
  • ios