Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: సిరితో షణ్ముఖ్‌ ఫ్రెండ్‌షిప్‌ ప్రేమగా మారుతుందా? మానస్‌ కెప్టెన్‌.. ఫైనల్‌కి సన్నీ?

రవి, శ్రీరామ్‌ గేమ్‌ ప్లాన్‌ గురించి మాట్లాడుకున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేసుకున్నారు. అలాగే సన్నీ, మానస్ లు కూడా సిరి, రవి, శ్రీరామ్‌ల గురించి డిస్కస్‌ చేసుకున్నారు. అనంతరం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. 

biggboss telugu 5 show 76 episode maanas won as captain siri shanmukh friendship turn love ?
Author
Hyderabad, First Published Nov 19, 2021, 11:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5), 75వ(76వ ఎపిసోడ్‌) రోజు గేమ్‌ చాలా నీరసంగా సాగింది. ఎపిసోడ్‌ మొత్తం ఎవిక్షన్‌ పాస్‌ గేమ్‌ చుట్టూతే సాగింది. శుక్రవారం ఎపిసోడ్‌ ప్రారంభంలో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇందులో కెప్టెన్సీ పోటీధారులు మానస్‌, సిరి, అనీ మాస్టర్‌, ప్రియాంకలు పోటీ పడ్డారు. రింగ్‌తో ఆడే కెప్టెన్సీ టాస్క్ లో మానస్‌(Maanas) విన్నర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ అయ్యాడు. అనంతరం కాజల్‌, సన్నీ(Sunny)ల మధ్య గత రోజు గొడవకి సంబంధించిన డిస్కషన్‌ జరిగింది. కాజల్‌(Kajal)పై ఫైర్‌ అయిన నేపథ్యంలో ఆమెని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. Maanas ఫ్రెండ్‌ అయినా మానస్‌కంటే నీ మీదనే ప్రేమ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు Sunny. 

మరోవైపు రవి, శ్రీరామ్‌ గేమ్‌ ప్లాన్‌ గురించి మాట్లాడుకున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేసుకున్నారు. అలాగే సన్నీ, మానస్ లు కూడా సిరి, రవి, శ్రీరామ్‌ల గురించి డిస్కస్‌ చేసుకున్నారు. అనంతరం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ పాస్‌ దక్కించుకునేందుకు ఇంటి సభ్యులు `నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా` గేమ్‌ ఆడాల్సి ఉంటుంది. ఇందులో చివరికి ఎవరి ఫోటో అయితే మిగులుతుందో వారికి ఈ పాస్‌ దక్కుతుంది. అందుకోసం గార్డెన్‌ ఏరియాలో ఫైర్‌ ఇంజన్‌ని పెట్టాడు బిగ్‌బాస్‌. దీనిలో భాగంగా బజర్‌ మోగగానే ఎవరైనా ఇద్దరు సభ్యులు ఫైర్‌ ఇంజిన్‌లోని రెండు సీట్లలో కూర్చొవాల్సి ఉంటుంది. వారి ముందు ఇద్దరి సభ్యుల ఫోటోలు వస్తాయి. వారిలో ఎవరికి ఎవిక్షన్‌ పాస్‌ ఇవ్వాలనుకుంటున్నారో నిర్ణయించి సంచాలక్ మానస్‌కి చెప్పాల్సి ఉంటుంది. 

మొదట సన్నీ, మానస్‌ సీట్లలో కూర్చొన్నారు. వీరి ముందు రవి, అనీ మాస్టర్‌ ఫోటోలు రాగా, అనీ మాస్టర్‌కి సపోర్ట్ చేశారు. రవి ఫోటో కాలిపోయింది. అనంతరం సిరి, షణ్ముఖ్‌ సీట్లో కూర్చున్నారు. వీరి ముందు పింకీ, సన్నీ ఫోటోలు ఉండగా, సన్నీకి సపోర్ట్ చేశారు. పింకీ ఫోటో కాలిపోయింది. అనంతరం అనీ మాస్టర్, శ్రీరామ్‌లు కూర్చున్నారు. సిరి, షణ్ముఖ్‌ ఫోటోలు రాగా, తనకు జనం ఓట్లు కావాలి,ఈ పాస్‌ అవసరం లేదంటాడు షన్ను. దీంతో సిరికి సపోర్ట్ చేశారు. తర్వాత ప్రియాంక, కాజల్‌ కూర్చున్నారు. సిరి, శ్రీరామ్‌ల ఫోటోలు వచ్చాయి. సిరిని సేవ్‌ చేశారు. శ్రీరామ్‌ ఫోటో కాలిపోయింది. అనంతరం అనీ మాస్టర్‌, ప్రియాంక దక్కించుకున్నారు. ఎదురుగా ఉన్న సన్నీ, కాజల్‌ ఫోటోలు ఉండగా, సన్నీకి సపోర్ట్ చేశారు. కాజల్‌ కాలిపోయింది. ఫైనల్‌గా మానస్‌, కాజల్‌ దక్కించుకున్నారు. వీరి ముందు అనీ మాస్టర్‌,సిరి ఫోటోలున్నాయి. ఎవరికి సపోర్ట్ చేయాలనేదానిపై వీరిద్దరి మధ్య కాన్‌ఫ్లిక్ట్ జరిగింది. అయితే ఇద్దరు సిరిని సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఫైనల్‌గా సన్నీ కి ఈ పాస్‌ దక్కుతుందని తెలుస్తుంది. అయితే ఇది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది. 

అయితే మధ్యలో ఈ గేమ్‌ ప్లాన్‌ గురించి ముందే నీకు తెలియదా అని ప్రియాంకని అనీ మాస్టర్ అడిగింది. నాకు తెలియదని పింకీ చెప్పగా, దూరంగా వెళ్లి అంతా నాటకాలు అని అనీ మాస్టర్‌ అనడంతో పింకీ ఫైర్‌ అయ్యింది. అయితే అది అన్నది నిన్ను కాదని, ఒట్టు కూడా వేసింది అనీ మాస్టర్‌. మరోవైపు మధ్యలో షణ్ముఖ్‌, సిరిల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గత వారం నుంచి గొడవలు పడుతూ, విడిపోతూ, కలుస్తున్న ఈ జోడి.. ఈ రోజు కూడా గొడవ పడేందుకు ప్రయత్నించారు. ఇతర గ్రూపులతో ఎందుకు మాట్లాడావు అని సిరిని ప్రశ్నించాడు షణ్ముఖ్‌. దీనికి సిరి సైతం అసహనం వ్యక్తంచేసింది. పక్క గ్రూపుతో కలిసిన వాళ్లు తనకు వద్దకు రావద్దని చెప్పాడు. దీంతో సిరి హర్ట్ అయినట్టు కనిపించింది. అయితే వీరిద్దరు హౌజ్‌లో ఫ్రెండ్స్ గా చెలామణి అవుతున్నారు. కానీ చూడబోతుంటే, ఇద్దరు లవర్స్ గా మారిపోతున్నట్టు అనిపిస్తుంది. వాళ్లిద్దరి వ్యవహారం అలాంటి ఆలోచనలే కలిగిస్తున్నాయి. 

also read: ChandrababuNaidu: `పవర్‌స్టార్‌/ఆర్జీవి` ట్రైలర్‌ చూసి కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు.. వర్మ సెటైర్లు
 

Follow Us:
Download App:
  • android
  • ios