Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: రవికి ఊహించని షాకిచ్చిన నాగార్జున.. హౌజ్‌ నుంచి వెళ్లిపొమ్మంటూ వార్నింగ్‌.. సన్నీపై ఫైర్‌

55వ రోజు ఎపిసోడ్‌లో మొదటగా శుక్రవారం హౌజ్‌లో ఏం జరిగిందో చూపించారు. ఇందులోనూ పాత విషయాలే డిస్కషన్‌లోకి వచ్చాయి. తమకి జరిగిన అన్యాయంపై సన్నీ తన ఫ్రెండ్స్ మానస్‌, కాజల్‌తో చర్చించారు. షణ్ముఖ్‌ సైతం తాను కెప్టెన్ కావడం వాళ్లకి ఇష్టంలేదని తెలిపారు. 

nagarjuna strong warning to ravi get out and fire on sunny at bigg boss telugu 5
Author
Hyderabad, First Published Oct 31, 2021, 12:09 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌5(Bii Boss Telugu 5).. 56వ ఎపిసోడ్‌ గరం గరంగా సాగింది. హోస్ట్ Nagarjuna వార్నింగ్‌, ప్రశంసలు హలైట్‌గా నిలిచాయి. నాగ్‌ ఇచ్చిన గేమ్‌లు ఎంటర్టైనింగ్‌గా సాగాయి. మొత్తంగా శనివారం షోని ఆద్యంతం ఆసక్తికరంగా సాగించాడు నాగ్‌. అయితే ఈ వారం నామినేషన్లో ఉన్న వారిని టచ్‌ చేయలేదు. రేపు(ఆదివారం) దీపావళి స్పెషల్‌గా పెద్ద ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. అందులో నామినేషన్లని సేవ్‌ చేయడం, ఎలిమినేట్‌ చేయడం జరుగుతుందట. 

55వ రోజు ఎపిసోడ్‌లో మొదటగా శుక్రవారం హౌజ్‌లో ఏం జరిగిందో చూపించారు. ఇందులోనూ పాత విషయాలే డిస్కషన్‌లోకి వచ్చాయి. తమకి జరిగిన అన్యాయంపై సన్నీ తన ఫ్రెండ్స్ మానస్‌, కాజల్‌తో చర్చించారు. షణ్ముఖ్‌ సైతం తాను కెప్టెన్ కావడం వాళ్లకి ఇష్టంలేదని తెలిపారు. ఇంతలో పూరీలు చేసే గేమ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఫ్రీడమ్‌ అయిల్‌ అందించిన ఈ గేమ్‌లో నిర్ణిత సమయంలో ఎవరు ఎక్కువగా పూరీలు చేస్తే వాళ్లు విన్నర్. ఇందులో ఆనీ మాస్టర్, రవి, శ్రీరామ్‌, విశ్వ, లోబో ఒక టీమ్‌గా, మానస్‌, సిరి, ప్రియాంక మరో టీమ్‌గా ఉన్నారు. ఈ గేమ్‌లో అనీ మాస్టర్‌ టీమ్‌ విజయం సాధించింది. 

అయితే ఈ విషయంపై సరిగ్గా తీర్పునివ్వాలని, మరోసారి బుక్‌ చదువుకుని తీర్పునివ్వాలని జైల్లో ఉన్న సన్నీ అనడంతో అనీ మాస్టర్‌ రియాక్ట్ అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి ఫైర్‌ స్టార్ట్ అయ్యింది. మా కష్టం గురించవు, మీ గ్రూప్‌ వాళ్లదే కష్టంగా అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదంటూ వాదించింది. ఈ క్రమంలో నార్త్, సౌత్‌ అనే టాపిక్‌, తెలంగాణ, ఇండియా అనే టాపిక్‌ వచ్చింది. దీంతో హౌజ్‌ ఒక్కసారిగా హీటెక్కింది. హోరా హోరిగా వాదించుకున్నారు. గ్రూపులుగా ఆడుతున్నారని అనీ మాస్టర్‌ అనడంతో తాము గ్రూపులుగానే ఆడతామని చెప్పాడు సన్నీ. అంతేకాదు బయటకు వస్తే మరోలా ఉంటుంది తన గేమ్‌ అంటూ హెచ్చరించారు. అనంతరం బిగ్‌బాస్‌ సన్నీని జైలు నుంచి విడుదల చేశారు. 

ఆ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులకు ప్రశంసలతోపాటు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వారం నామినేషన్‌లో భాగంగా ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ అందుకోలేక, త్యాగం చేసిన షణ్ముఖ్‌, సిరి, లోబో, రవి, శ్రీరామ్‌, మానస్‌లకు క్లాప్స్ తో అభినందనలు తెలిపారు. ఆ తర్వాత వార్నింగ్‌లు స్టార్ట్ చేశారు నాగార్జున. ఇంటి సభ్యులు ఫోటోలు కట్‌ చేస్తూ వారి చేసిన విషయాలను తెలియజేశారు. మొదట లోబో ఫోటో కట్‌ చేస్తూ గేమ్‌ బాగా ఆడుతున్నావని, ముత్యాల గేమ్‌పై ప్రశంసలు కురిపించారు. ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలన్నారు. 

రవి ఫోటో కట్‌ చేస్తూ .. ఎందుకు బాధ అనే విషయాన్ని అడిగాడు నాగ్‌. ముందుగా ఓ వీడియో క్లిప్‌ చూపించాడు. అందులో రవి ఇందులో ఉండటం కరెక్టేనా, ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో తెలియడం లేదంటూ వాపోయాడు. అనంతరం దీనిపై రవి స్పందిస్తూ తన భార్య, కూతురు ఎలా ఉన్నారో తెలియడం లేదు. ఆ విషయాలు చెబితే బాగుంటుందని తాను ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యానని తెలిపారు రవి. నాగ్‌ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. హౌజ్‌లోకి వచ్చే ముందే స్ట్రాంగ్గ్‌గా ఉండాలని, అందుకు ఒప్పుకునే వచ్చావని, ఫ్యామిలీ వాళ్లని ఎప్పుడు చూపించాలో బిగ్‌బాస్‌కి తెలుసని తెలిపారు. 

నిజంగా ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే, ఉండలేకపోతున్నవారంటే వెళ్లిపోవచ్చు అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. గేట్లు ఓపెన్‌ చేస్తానని, వెళ్లిపో అని స్పష్టం చేశారు. హౌజ్‌లోకి వచ్చారంటే అన్ని భరించి స్ట్రాంగ్‌గా ఉండాలని, ఫ్యామిలీతో అటాచ్‌మెంట్ అందరికి ఉంటుందని, నువ్వు అలా అనడం వల్ల ఇతరులను కూడా మిస్‌ గైడ్‌ చేసినట్టుందని, లేని ఆలోచనలు కలిగించినట్టు ఉంటుందని హెచ్చరించారు. ఇంకెప్పుడు అలా చేయోద్దని, స్ట్రాంగ్‌గా ఉండాలని తెలిపారు. 

మానస్‌ ఫోటో కట్‌ చేస్తూ, కెప్టెన్సీ టాస్క్ బాగా ఆడావని, ఇంకా బాగా చేయాల్సింది అని చెప్పారు. హౌజ్‌లో అన్యాయం జరుగుతుందా? అని మానస్‌ని నాగ్‌ అడిగారు. సంచాలక్ నిర్ణయం నచ్చలేదని చెప్పగా, సంచాలక్‌ చెప్పిందే ఫైనల్‌ అని తెలిపారు. ప్రియాంక ఫోటో కట్‌ చేస్తూ.. కాన్వాస్‌పై రంగులేసే టాస్క్ లో బాగా శ్రమించావని, అయితే ఆనీ మాస్టర్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టావని, లేకపోతే గెలిచేదానివన్నారు. అయితే ఆ సమయంలో కింద పడితే మానస్‌ స్పందించలేదని అడిగాడు నాగ్‌. దానికి ప్రియాంక స్పందిస్తూ ఆయన అడిగారని, ఆయనకు దెబ్బలంటే భయం అని అందుకే దూరంగా ఉన్నారని చెప్పింది. 

also read: పైట కొంగు దాచలేని హాట్‌ అందాలతో కైపెక్కిస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తిసునైనా..తగ్గేదెలే అంటోన్న షన్ను లవర్‌

అనీ మాస్టర్‌ గురించి చెబుతూ కెప్టెన్సీ టాస్క్ లో వద్దు అని వారించినా వినకుండా బయటకు రావడంపై నాగ్‌ ఫైర్‌ అయ్యారు. వంటలు చేయడానికి మాత్రమే కాదు, గేమ్ ఆడాలని, కెప్టెన్ అవ్వాలని తెలిపారు. మిత్రలాభం, మిత్ర భేదం వంటి వాటిని కూడా ఉపయోగించాలన్నారు. కాజల్‌ గురించి చెబుతూ, నువ్వెప్పుడు కెప్టెన్‌ అవుతావని ప్రశ్నించాడు. జెస్సీ గురించి చెబుతూ, సంచాలకుడిగా ఉన్నప్పుడు బుక్‌ని ఒకటికి రెండు సార్లు చదువు అని, రాంగ్‌ జడ్జ్ మెంట్‌ ఇవ్వొద్దని తెలిపారు. 

ఇక సన్నీకి మాత్రం గట్టిగా క్లాస్‌ పీకాడు నాగ్‌. వేలు చూపుతూ మీద మీదకి వెళ్లడం కరెక్ట్ కాదని, చాలా సార్లు అలా వెళ్తున్నావని తెలిపారు. గేమ్‌ ఆడాలని, అరవడం తప్పు కాదని, కానీ అతిగా రియాక్ట్ అవడం, మీద మీదకి వెళ్లడాన్ని తగ్గించుకోవాలని హెచ్చరించారు. అందుకు సన్నీ క్షమాపణలు చెప్పారు. 

also read: రెబల్‌స్టార్‌కి బ్రహ్మానందం సర్‌ప్రైజ్‌.. ట్విట్టర్‌ ద్వారా సంతోషం వ్యక్తం చేసిన కృష్ణంరాజు

Follow Us:
Download App:
  • android
  • ios