ఓ స్పెషల్‌ గిఫ్ట్ ఇచ్చి కృష్ణంరాజుని ఆశ్చర్యపరిచారు బ్రహ్మానందం. తాను స్వయంగా గీసిన సాయిబాబా చిత్రపటాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు బ్రహ్మీ. ఈ స్సెషల్‌ గిఫ్ట్ ని చూసి కృష్ణంరాజు దంపతులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.

కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam).. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు(Krishna Raju)ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ స్పెషల్‌ గిఫ్ట్ ఇచ్చి కృష్ణంరాజుని ఆశ్చర్యపరిచారు బ్రహ్మానందం. తాను స్వయంగా గీసిన సాయిబాబా చిత్రపటాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు బ్రహ్మీ. ఈ స్సెషల్‌ గిఫ్ట్ ని చూసి కృష్ణంరాజు దంపతులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా బ్రహ్మానందం ఇలాంటి మంచి బహుమతినివ్వడం పట్ల కృష్ణంరాజు రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 

అయితే ఈ విషయాన్ని Krishna Raju తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. Brahmanandam ఇచ్చిన గిఫ్ట్ తో దిగిన ఫోటోలను షేర్‌ చేసుకుంటూ మన కామెడీ జీనియస్‌.. ఆర్ట్ లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్‌ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్‌ ది స్పెషల్‌ సర్‌ప్రైజ్‌` అని పేర్కొన్నారు కృష్ణంరాజు. ఈ సందర్బంగా కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బ్రహ్మానందం. ఇటీవల కృష్ణంరాజు తుంటికి ఆపరేషన్‌ అయ్యింది. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 

Scroll to load tweet…

శనివారం ఉదయం కృష్ణంరాజు ఇంటికెళ్లిన బ్రహ్మీ.. ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకాబు చేసి, అనంతరం తాను స్వయంగా గీసిన చిత్రపటాన్ని గిఫ్ట్ గా ఇచ్చి ఖుషీ చేశారు. కాగా బ్రహ్మానందం అద్బుతమైన కమెడీయన్‌ మాత్రమే కాదు, మంచి చిత్రకారుడు కూడా. ఆయన గతంలో చాలా చిత్రపటాలు వేశారు. వాటిని ట్విట్టర్‌ ద్వారా పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు అల్లు అర్జున్‌, రానా వంటి హీరోలకు స్వయంగా తాను గీసిన చిత్రపటాలను గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి వంటి చిత్రాలు పటాలు వేశారు బ్రహ్మీ. 

ఒకప్పుడు కామెడీ కింగ్‌గా టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన బ్రహ్మానందం ఇటీవల సినిమాలు బాగా తగ్గించారు. ఆయనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం, ఆయన కూడా అనారోగ్య కారణంగా సెలక్టీవ్ గా చేస్తుండటంతో తెరపై కనిపించడం తగ్గిపోయింది. అయితే కొత్తగా వస్తోన్న కమెడీయన్ల కారణంగానూ బ్రహ్మీకి ఛాన్స్ లు తగ్గాయనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన `రంగమార్తాండ`, `పంచతంత్రం` చిత్రాలో నటిస్తున్నారు. ఇటీవల `జాతిరత్నాలు`లో జడ్జ్ గా కడుపుబ్బ నవ్వించిన విషయం తెలిసిందే. 

also read: పెళ్లై ఏడాది.. భర్తతో రొమాంటిక్‌ ఫోటోని పంచుకున్న కాజల్‌.. ఫన్నీ పోస్ట్ వైరల్‌