అక్కినేని నాగార్జున ట్రెండ్ కి తగ్గట్లుగా కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నేటి ట్రెండ్ మొత్తం సెక్స్ థీమ్స్ తో సాగుతోంది. లిప్ లాక్స్, బోల్డ్ సన్నివేశాలు వంటివి ప్రతి సినిమాలో కామన్ అయిపోయాయి.

ఇప్పుడు నాగార్జున కూడా అలాంటి సినిమానే ఎన్నుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఆయన నటించిన 'మన్మథుడు' సినిమాకి సీక్వెల్ గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ 'మన్మథుడు 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకులముందుకు వచ్చింది.

ఎవరూ ఊహించని విధంగా టీజర్ ని డిజైన్ చేశారు. మన్మథుడుకి సీక్వెల్ అంటే మహా అయితే స్త్రీలోలుడుగా నాగ్ ని చూపిస్తారనుకుంటే ఏకంగా లిప్ లాస్ సీన్స్, బోల్డ్ సీన్స్ పెట్టి షాక్ ఇచ్చారు. పైగా టీజర్ లో నాగార్జున.. ''I dont fall in love..I only make love (నేను ప్రేమలో పడను.. సెక్స్ మాత్రమే చేస్తాను)'' అంటూ బోల్డ్ గా డైలాగ్ చెప్పేశాడు.

వయసు మళ్లిపోయినా పెళ్లి కాని ఓ బ్రహ్మచారి చుట్టూ కథ తిరుగుతుంది. టీజర్ లోనే హద్దులు దాటేసి కొన్ని సీన్లు చూపించారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..!

మన్మథుడు2 టీజర్: లిప్ లాక్స్ తో రెచ్చిపోయిన నాగ్