అక్కినేని నాగార్జున 'మన్మథుడు 2' టీజర్ తో ఒక్కసారిగా అందరికి షాకిచ్చాడు. ఎప్పుడు లేని విధంగా లిప్ లాక్స్ తో దర్శనమిచ్చాడు. ప్రతి సినిమాలో రొమాంటిక్ గా కనిపించే నాగ్ ఎప్పుడు డోస్ పెంచలేదు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ కి తగ్గటుగా రెచ్చిపోయాడనిపిస్తోంది. 

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన మన్మథుడు 2 రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో నాగ్ కి పెళ్లి అవసరమా అనే సెటైర్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇక చివరలో నాగ్ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. మెయిన్ గా నాగ్ లిప్ లాక్స్ షాకిచ్చాయనే చెప్పాలి. ఇక సినిమాలో ఇంకెన్ని షాకులు ఉన్నాయో తెలియాలంటే ఆగస్ట్ 9వరకు వెయిట్ చేయాల్సిందే.

ముందైతే టీజర్ పై ఓ లుక్కేయండి..