MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?

Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?

కిరణ్‌ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ `చెన్నై లవ్‌ స్టోరీ`. ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందంటే?

5 Min read
Author : Aithagoni Raju
Published : Jul 24 2026, 01:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ

కిరణ్‌ అబ్బవరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో రెండు మూడు సినిమాలు బాగా ఆడాయి. కానీ ఆ తర్వాత విజయాలు దక్కలేదు. ఆరేడు మూవీస్‌ వరుసగా పరాజయం చెందాయి. ఈ క్రమంలో ఆయనకు `క` సినిమా విజయాన్ని అందించింది. కమ్‌ బ్యాక్‌ అయ్యేలా చేసింది. ఆ తర్వాత సినిమా కూడా ఆడలేదు. చివరగా `కే ర్యాంప్‌`తో పెద్ద హిట్‌ అందుకున్నాడు. అదే జోరులో ఇప్పుడు చెన్నై లవ్‌ స్టోరీ మూవీతో వచ్చాడు. శ్రీ గౌరీ ప్రియా ఇందులో హీరోయిన్‌గా నటించగా, సాయిరాజేష్‌ దీనికి కథ అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్‌, సాయి రాజేష్‌ నిర్మించారు. ధీరజ్‌ మొగిలినేని సహనిర్మాత. టీజర్‌, ట్రైలర్‌ తో ఆకట్టుకుందీ మూవీ. పాటలు కూడా హిట్‌ అయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం(జులై 24)న సినిమా విడుదలైంది. మరి మూవీ ఎలా ఉంది? కిరణ్‌ అబ్బవరం కి మరో హిట్‌ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
చెన్నై లవ్‌ స్టోరీ కథ ఏంటంటే?
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ కథ ఏంటంటే?

పెళ్లి పీఠలమీదే నివేదిత(శ్రీ గౌరీ ప్రియా) పెళ్లి క్యాన్సిల్‌ అవుతుంది. ప్రేమించిన అజయ్‌(త్రిగుణ్‌)తో పెళ్లి పీఠలకు ఎక్కే సమయంలోనే అతను తనకు ఈ మ్యారేజ్‌ ఇష్టం లేదని, తాను మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో నివి డిప్రెషన్‌లోకి వెళ్తుంది. ఆ బాధలో ఫ్రెండ్‌ సిరి(హనుమంత్)తో కలిసి చెన్నై వెళ్తుంది. అక్కడ బీచ్‌లో ఉండగా, స్టీవెన్‌ శంకర్‌(కిరణ్‌ అబ్బవరం) కలుస్తాడు. తను డైరెక్టర్‌ అవకాశాల కోసం తిరుగుతుంటాడు. అక్కడ అసిస్టెంట్లకి కథ చెప్పగా, వాళ్లు ఛీ కొట్టి పోతారు. ఆ సమయంలోనే నివి, సిరి బ్యాచ్‌ కలుస్తారు. వాళ్లకి తన బాధలు చెప్పగా అతన్ని తమ రూమ్‌కి తీసుకెళ్తారు. స్టీవెన్‌కి అమ్మానాన్న ఎవరూ లేరు. ఒక అనాథ. దర్శకుడి అవకాశాల కోసం తిరుగుతుంటాడు. మనిషి అమాయకుడే అయినా ఓవర్‌గా అరుస్తుంటాడు, ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటాడు. డిప్రెషన్‌లో ఉన్న తనని డిస్టర్బ్ చేయడంతో స్టీవెన్‌ని గట్టిగా తిడుతుంది నివి. దీంతో హర్ట్ అవుతాడు. ఆ తర్వాత ఓ రోజు హోటల్‌లో దర్శకుడు పీ వాసు కలవడంతో అతన్ని అడిగి స్టీవెన్‌కి అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తుంది. కానీ స్టీవెన్‌ నరేషన్‌ లో ఫెయిల్‌ అవుతాడు. ఆ తర్వాత నెమ్మదిగా నివికి, వారి ఫ్రెండ్స్ కి దగ్గరవుతాడు. అతను చెప్పిన మాటలకు నివి కూడా తన గతాన్ని మర్చిపోయి మామూలు మనిషి అవుతుంది. క్రమంగా స్టీవెన్‌కి పడిపోతుంది. మరోవైపు స్టీవెన్‌ చెప్పిన కథ కూడా పి వాసుకి నచ్చుతుంది. ఓ రోజు గుళ్లోకి వెళ్లినప్పుడు స్టీవెన్‌కి ప్రపోజ్‌ చేస్తుంది నివి. దెబ్బతో ఎమోషనల్‌ అయిన స్టీవెన్‌.. కన్నీళ్లు పెట్టుకొని ఆమెకి ఓకే చెబుతాడు. ఆ తర్వాత పెళ్లికి రెడీ అవుతారు. ఆ రోజే టీమ్‌కి నరేషన్‌ ఇవ్వాలని దర్శకుడు చెప్పగా, స్టీవెన్ నరేషన్‌ ఇచ్చి, సినిమా ఓకే చేసుకుంటాడు. చెక్‌ కూడా అందుకుంటాడు. ఆ ఆనందంలో ఇంటికి వస్తుండగా, యాక్సిడెంట్‌ అవుతుంది? మొత్తం తలక్రిందులవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? నివి, స్టీవెన్‌ పెళ్లి చేసుకున్నారా? మళ్లీ నివి లైఫ్‌లోకి అజయ్‌ ఎందుకు వచ్చాడు? అతని విషయంలో స్టీవెన్‌ ఎందుకు అసూయగా ఫీలయ్యాడు? ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఏ తీరం చేరింది? స్టీవెన్‌ జీవితంలోని విషాదం ఏంటనేది అసలు సినిమా.

Related Articles

Related image1
Jana Nayagan Review: జన నాయకుడు మూవీ రివ్యూ.. విజయ్‌ చివరి మూవీ, అభిమానులకు పండగేనా?
Related image2
Mohan Babu: ఎన్టీఆర్‌ తో సినిమా చేశాక మోహన్‌బాబు పని అయిపోయిందన్నారు.. తిరిగి టాప్‌లో నిలబెట్టిన మూవీ ఏంటో తెలుసా?
37
చెన్నై లవ్‌ స్టోరీ మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ మూవీ విశ్లేషణ

ప్రేమ కథా చిత్రాలు ఎన్ని వచ్చినా అవి కొత్తగానే ఉంటాయి. ఒక్కో ప్రేమ కథ ఒక్కోలా ఉంటుంది. ప్రతిదీ కొత్త ఫీలింగ్‌ ఇస్తుంటుంది. కాకపోతే బాగా తీయగలిగాలి, ఆ కథని బాగా చెప్పగలిగాలి. అలా `చెన్నై లవ్‌ స్టోరీ` కూడా ఓ డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ. ఒక ఫ్రెష్‌ లవ్‌ స్టోరీ అని చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచే ఓ కొత్త ఫీలింగ్‌ని ఇస్తుంది. హీరోయిన్‌ తన పెళ్లి క్యాన్సిల్‌ కావడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి, మందుకు బానిస కావడమనేదే వెరైటీగా ఉంది. అది ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంది. దాన్నుంచి బయటపడేందుకు చెన్నైకి వెళ్లగా, అక్కడ హీరో తగులుతాడు. అతను మొదట చిరాకు తెప్పించినా, తర్వాత తన కథ చెప్పి, తాను ఆమెకి బానిస అని చెప్పి ఇంప్రెస్‌ చేస్తాడు. ఆమెకి దగ్గరవుతాడు. మళ్లీ ప్రేమలో పడతారు. ఆ తర్వాత పెళ్లికి రెడీ అవుతుండగానే మరో షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత కథ అనేక మలుపులతో సాగుతుంది. మొదటి భాగం సినిమా చాలా ఫన్నీగా సాగుతూనే ఎమోషనల్‌ టచ్‌ ఇస్తుంది. హీరోయిన్‌ లవ్‌ బ్రేకప్‌, ఆమె మందు తాగడం, డేర్‌గా ఉండటం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక కిరణ్‌ అబ్బవరం చేసే హడావుడి కూడా నవ్విస్తుంది. అదే సమయంలో తన సొంత కథ చెప్పడంతో అది ఎమోషనల్‌గా హార్ట్ టచ్‌ చేస్తుంది. ఇలా ఫస్టాఫ్‌ అంతా కొంత ఫన్‌, మరికొంత ఎమోషనల్‌, ఇంకొంత లవ్‌, ఫీల్‌ గుడ్‌ గా సాగుతుంది. ఫస్టాఫ్‌ సినిమా వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్‌ ట్విస్ట్ మాత్రం షాకిస్తుంది. మతిపోయేలా ఉంటుంది.  అదే సమయంలో నెక్ట్స్ ఎలా తీసుకెళ్తారు, ఎలా ఎంగేజ్‌ చేస్తారనేది సస్పెన్స్, ఆ విషయంలో మేకర్స్ చాలా వరకు సక్సెస్‌ అయ్యారు. కిరణ్‌ అబ్బవరం పాత్ర కి సంబంధించిన రియాలిటీ మిస్‌ అయ్యింది. హీరోయిన్‌ ప్రేమ కోసం వచ్చి ఆమెని ఇరిటేట్‌ చేసే సీన్లు ఆడియెన్స్ కి కూడా చిరాకు తెప్పిస్తాయి. మధ్య మధ్య కొంత ఫన్‌ ఉన్నా, అది కొంత వరకే పరిమితం. మధ్యలో కుక్కలతో చేయించే యాక్షన్‌ సీన్‌ బాగుంది. ఆ సమయంలో చూపించిన సీన్లు స్టీవెన్‌ రియాలిటీని ఆవిష్కరిస్తాయి. క్లైమాక్స్ మోస్ట్ ఎమోషనల్‌గా ఉంటుంది. అదే సమయంలో కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది.

47
చెన్నై లవ్‌ స్టోరీలో ప్లస్‌ లు, మైనస్‌లు
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీలో ప్లస్‌ లు, మైనస్‌లు

అయితే సినిమా లవ్‌, ఫీల్‌ గుడ్‌ అంశాలు, ఫన్‌తోపాటు ఎమోషన్స్ మెయిన్స్ గా రన్‌ అవుతుంది. హీరో పాత్రలోని ఎమోషన్స్, హీరోయిన్‌ పాత్రలోని ఎమోషన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఫస్టాఫ్‌లో కిరణ్‌ అబ్బవరం రెండు చోటు ఇచ్చిన ఎలివేషన్‌ అదిరిపోయింది. తన గతం చెప్పడం, నేను నీకు బానిస అని చెప్పే సీన్ అదిరిపోయింది. ఇక టెంపుల్‌లో లవ్‌ ప్రపోజ్‌ చేసినప్పుడు వర్షంలో వచ్చే సీన్లు గుండెని పిండేస్తుంది. అందులో ఇద్దరూ అదరగొట్టారు. సెకండాఫ్‌లోనూ ఇద్దరి మధ్య కామెడీ బాగానే ఉంది. కాకపోతే సినిమా ల్యాగ్‌ అనిపిస్తుంది. స్లోగా సాగుతుంది. కిరణ్‌ పాత్రలోని ట్విస్ట్ రివీల్‌ కావడంతో కిక్ మిస్‌ అయిన ఫీలింగ్‌ ఉంటుంది. రియాలిటీ మిస్‌ అయ్యింది. థియేటర్‌ సీన్లు బాగుంది. ఫైట్లు, క్లైమాక్స్ ఫర్వాలేదు. కాకపోతే ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఫస్టాఫ్‌ స్థాయిలో సెకండాఫ్‌ లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. అక్కడ క్లారిటీ మిస్‌ అయ్యింది. ఒక పాట బాగుంది. మిగిలిన పాటలు గొప్పగా లేవు. ఆర్‌ఆర్‌ విషయంలో మణిశర్మ తన మార్క్ చూపించాడు. చాలా సీన్లని అది ఎలివేట్‌ చేసింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్లు పిండేసేలా చేయడంలో మణిశర్మ సక్సెస్‌ అయ్యారు. కొన్ని లాజికల్‌ లెస్‌ సీన్లు ఉన్నాయి. తొలి ప్రేమ కాదు, రెండో ప్రేమ కూడా గొప్పదే అని చెప్పే ప్రయత్నం చేస్తూనే, తొలి ప్రేమకి ముడిపెట్టిన ముగించిన తీరు క్లారిటీ మిస్‌ అయ్యింది. ఇలా కొన్ని మైనస్‌లు పక్కన పెడితే యూత్‌కి, స్టూడెంట్స్ కి, ప్రేమలో పడ్డ ప్రతి ఒక్కరికి మంచి అనుభూతినిచ్చే సినిమా అవుతుంది.

57
చెన్నై లవ్‌ స్టోరీలో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీలో నటీనటులు ఎలా చేశారంటే?

స్టీవెన్‌ శంకర్‌ పాత్రలో కిరణ్‌ అబ్బవరం బాగా చేశాడు. పాత్రలో జీవించాడు. ఎమోషనల్‌ సీన్లలో రెచ్చిపోయాడు. టెంపుల్‌లో ప్రపోజ్‌ చేసినప్పుడు వచ్చే సీన్ లో కిరణ్‌ చాలా మెచ్యూరిటీగా చేశాడు. దుమ్ములేపాడు. ఇలా చాలా చోట్ల ఆయన మార్క్  సీన్లు ఉన్నాయి. అవి ఆకట్టుకునేలా ఉన్నాయి. నివిగా గౌరీ ప్రియ ఇరగదీసింది.  ఎమోషనల్‌ సీన్లలో దుమ్ములేపింది. ఆమె పర్ఫెర్మెన్స్ ఆడియెన్స్ కి సర్‌ప్రైజ్‌ అని చెప్పొచ్చు. చాలా సీన్లలో బాగా చేసింది. సినిమాకి తనే హీరో అనిపించేలా చేసింది. లవ్‌ సీన్లు, ఎమోషనల్‌ సీన్లు, డిప్రెషన్‌ సీన్లు, మందు తాగే సీన్లలో గౌరీ ప్రియా బెస్ట్ ఇచ్చింది. వాహ్‌ అనిపించింది. ఇక అజయ్‌గా త్రిగుణ్‌ తనకు సెట్ అయ్యే పాత్రలో బాగా చేశాడు. సిరిగా సిరి హన్మంతు ఆకట్టుకుంది. పి వాసు కాసేపు కనిపించి మెప్పించారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

67
టెక్నీకల్‌గా హైలైట్గా చెన్నై లవ్‌ స్టోరీ
Image Credit : Asianet News

టెక్నీకల్‌గా హైలైట్గా చెన్నై లవ్‌ స్టోరీ

టెక్నీకల్‌గా మూవీ చాలా బాగుంది. సాయి రాజేష్‌ రైటింగ్‌ అదిరిపోయింది. డైలాగ్స్, కథ నెరేషన్‌ సినిమాకి పెద్ద అసెట్‌గా నిలుస్తుంది. కథ కూడా కొత్తగా ఉంది. దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు కూడా అంతే బాగుంది. ఇందులో సాయి రాజేష్‌తోపాటు దర్శకుడు రవి నంబూరి టాలెంట్‌ కనిపిస్తుంది. వారి ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. విశ్వాస్‌ డేనియల్ కెమెరా వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్‌ పెయింటింగ్‌లా ఉంది. విజువల్స్ మూవీకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా చెప్పాలి. బ్యూటిఫుల్‌గా సినిమా ఉందంటే దానికి కారణం కెమెరానే. ఎడిటింగ్‌ పరంగా ఇంకా బాగా కట్‌ చేయాలి. కొంత ట్రిమ్‌ చేయోచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో. ఆర్ట్ వర్క్ మరో ఎట్రాక్షన్‌. నిర్మాతలు బాగా తీశారు. రాజీపడకుండా చేశారు. దర్శకుడు రవి నంబూరి తీసిన తీరు బాగుంది. కానీ సెకండాఫ్‌ని ఇంకా బాగా రాసుకోవాల్సింది. చాలా సీన్లు రెగ్యూలర్‌గా ఉంటాయి. తేలిపోయాయి. లాజిక్‌ లెస్‌గా ఉంటాయి. కానీ ఓవరాల్‌గా యూత్‌ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారు. ఈ మూవీ కుర్రాళ్లకి మతిపోయేలా చేస్తుందని చెప్పొచ్చు. అదే సమయంలో చాలా నీట్‌గా, క్లీన్‌గా సాగే సినిమా కావడం విశేషం.

77
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

చెన్నై లవ్‌ స్టోరీ.. ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ. కొత్త ఫీల్‌నిచ్చే చిత్రం. యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.

రేటింగ్‌ : 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan Review: జన నాయకుడు మూవీ రివ్యూ.. విజయ్‌ చివరి మూవీ, అభిమానులకు పండగేనా?
Recommended image2
Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?
Recommended image3
Oh Sukumari Review: ఓ సుకుమారి మూవీ రివ్యూ.. తిరువీర్‌, ఐశ్వర్యా రాజేష్‌ నవ్వించడంలో సక్సెస్ అయ్యారా
Related Stories
Recommended image1
Jana Nayagan Review: జన నాయకుడు మూవీ రివ్యూ.. విజయ్‌ చివరి మూవీ, అభిమానులకు పండగేనా?
Recommended image2
Mohan Babu: ఎన్టీఆర్‌ తో సినిమా చేశాక మోహన్‌బాబు పని అయిపోయిందన్నారు.. తిరిగి టాప్‌లో నిలబెట్టిన మూవీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved