నాగార్జున, ధనుష్‌ కలిసి నటిస్తున్న `కుబేర` చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. నాగార్జున పాత్ర, సినిమా స్టోరీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  

నాగార్జున ఈ సంక్రాంతికి `నా సామిరంగ`తో హిట్‌ కొట్టాడు. ఇప్పుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ``కుబేర` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ధనుష్‌ మెయిన్‌ హీరో. నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదొక రకమైన మల్టీస్టారర్‌. ఇటీవల శివరాత్రి సందర్బంగా సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ధనుష్‌ని చూపించారు. ఆయన బిచ్చగాడిలా(పేదవాడిలా) కనిపిస్తున్నాడు. టైటిల్‌ మాత్రం `కుబేర` అని నిర్ణయించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. సినిమా షూటింగ్‌ అప్‌డేట్ తెలిపింది. బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుతున్నట్టు వెల్లడించింది. అక్కడ నాగార్జునపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. టాకీ పార్ట్ ని షూట్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రెండు ఫోటోలను పంచుకుంది యూనిట్‌. ఇందులో ఒక ఎత్తైన బిల్డింగ్‌లో చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నాగార్జునతో శేఖర్‌ కమ్ముల ముచ్చటిస్తున్నారు. మరోవైపు కెమెరాని రెడీ చేస్తున్నారు. 

ఈ ఒక్క ఫోటో సినిమా స్టోరీ ఏంటో తెలియజేస్తుంది. ఇందులో ధనుష్‌ బిచ్చగాడిగా కనిపిస్తే, ఇప్పుడు నాగార్జున రిచ్‌ మ్యాన్‌గా కనిపిస్తున్నారు. ఆయన ఉన్న లొకేషన్‌ చూస్తుంటే చాలా సంపన్నుడిగా కనిపిస్తున్నారు. మరి ఇద్దరికి ఉన్నసంబంధం ఏంటనేది ఇంట్రెస్టింగ్‌. ఇదిలా ఉంటే ఈ మూవీ ముంబయి మాఫియా డాన్‌ చుట్టూ సాగుతుందట. ఆ మాఫియా డాన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగ్‌ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని మరో వార్త తెలుస్తుంది. మరి ధనుష్‌ డానా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇదే సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మరోవైపు `బిచ్చగాడు` మూవీ స్టయిల్‌లోనూ సాగుతుందని అంటున్నారు. ఏది నిజమనేది మున్ముందు తేలనుంది.

శేఖర్‌ కమ్ముల అంటే సెన్సిబుల్‌ డైరెక్టర్‌. లవ్‌, రొమాన్స్ ప్రధానంగా, హ్యూమన్‌ ఎమోషన్స్ తో సినిమా చేస్తూ మెప్పిస్తున్నారు. సమాజంలోని ఏదో ఒక అంశాన్ని తన సినిమాలో అంతర్లీనంగా ఆవిష్కరిస్తారు. కానీ ఈ సినిమా ఆయన స్టయిల్‌కి పూర్తి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి `కుబేర` చిత్రంలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరం. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఏషియన్‌ సినిమాస్‌ నిర్మిస్తున్న చిత్రమిది.

Read more: చిరంజీవితో ఉన్న గొడవేంటో బయటపెట్టిన నటి సుహాసిని.. మెగాస్టార్‌ని పట్టుకుని అంత మాట అనేసిందే!