MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చిరంజీవితో ఉన్న గొడవేంటో బయటపెట్టిన నటి సుహాసిని.. మెగాస్టార్‌ని పట్టుకుని అంత మాట అనేసిందే!

చిరంజీవితో ఉన్న గొడవేంటో బయటపెట్టిన నటి సుహాసిని.. మెగాస్టార్‌ని పట్టుకుని అంత మాట అనేసిందే!

మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే వీరి మధ్య స్నేహం, అనుబంధం గొడవతో ప్రారంభమైందట. మరి ఆ గొడవేంటో తాజాగా సుహాసిని బయటపెట్టింది.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 14 2024, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

చిరంజీవి, సుహాసిని జోడీ అప్పట్లో అత్యంత విజయవంతమైన జోడీగా రాణించింది. 1980-90లో కలిసి చాలా సినిమాలు చేశారు. అలా `మంచుపల్లకి`, `మగమహారాజు`, `ఛాలెంజ్‌`, `చట్టబ్బాయి`, `రాక్షసుడు`, `కిరతాకుడు`, `ఆరాధన`, `మరణ మృధంగం` వంటి సినిమాల్లో చిరు, సుహాసిని కలిసి నటించి మెప్పించారు. హిట్‌ పెయిర్‌గా నిలిచారు. అయితే ఈ ఇద్దరి మధ్య అనుబంధం గొడవలతో ప్రారంభమైందట. తాజాగా ఆ విషయాన్ని సుహాసిని బయటపెట్టింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సుహాసిని మొదట్లో సినిమాలకి అస్టిస్టెంట్‌గా పనిచేసింది. ఆ తర్వాత హీరోయిన్‌ అయ్యింది. ప్రారంభంలో చిరు `కాళీ` అనే ఓ తమిళ సినిమాలో నటించారు. ఆ మూవీకి సుహాసిని అసిస్టెంట్‌గా పనిచేసింది. సినిమా షూటింగ్‌ సమయంలో చిరంజీవికి కొత్తగా పెళ్లైందట, తమిళం రాకపోవడంతో ఒంటరిగా మూలకు కూర్చున్నాడట. అది చూసిన సుహాసిని అసిస్టెంట్లని అడగ్గా ఆయన తెలుగు హీరో, తమిళం రాదు అని చెప్పారట. దీంతో తనే చిరు వద్దకు వెళ్లి మాట్లాడిందట. 
 

39

కట్‌ చేస్తే ఆమె రెండో సినిమా చిరంజీవితో హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చింది. అదే `మంచు పల్లకి`. అది చూసి చిరు ఆశ్చర్యపోయారట. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య గొడవైందట. ఆ గొడవేంటో గుర్తు లేదుగానీ, ఈ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువ అనే భావని చిరంజీవిలో ఉండేదన్నారు.
 

49

ఆ తర్వాత ఎయిర్‌ ఇండియా ప్రయాణిస్తున్నప్పుడు తన పక్కనే వచ్చి కూర్చున్నారట. వచ్చి ఎక్కడ, ఎన్నిరోజులు ఉంటావని అడిగారట. అంతా అయిపోయాక, ఏదైనా అవసరం ఉన్నా, ఏమన్నా కావాలనిపించినా,  ఏదైనా ప్రాబ్లెమ్‌ ఉంటే నన్ను అడక్కు అని చెప్పి  నిద్ర పోయారట. దీంతో ఏంటి ఈయన ఏం మాట్లాడలేదు, ఏం హెల్ప్ అడగొద్దు అంటున్నారు, నిద్రపోయారు అని మనసులో అనుకుందని సుహాసిని. ఆయనలాంటి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎవరికీ ఉండదని తెలిపింది సుహాసిని. 

59

ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్‌ చేసింది. ఒక తమిళ సినిమాలో సుహాసిని, సుమలత కలిసి పనిచేస్తున్నారట. ఆ సమయంలో `నువ్వు చిరంజీవితో సినిమా చేస్తున్నావట` అని ఆమె సుహాసిని అడిగిందట. అయితేఏంటి? అన్నదట. దీంతో ఆయన తెలుగులో గ్రేట్‌ అప్‌కమింగ్‌ స్టార్‌, మంచి యాక్టర్‌, తమిళంలో కమల్‌ హాసన్‌ ఎలాగో, తెలుగులో ఆయన అలాగా అన్నందట. అంతా విని `అయ్యో చూడ్డానికి విలన్‌ లా ఉన్నారే` అంటూ కౌంటర్‌ ఇచ్చిందట సుహాసిని. 
 

69

అంతేకాదు సుమలత ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పిందట. ఆ నెక్ట్స్ డే షూటింగ్‌కి వచ్చినప్పుడు `విలన్‌ తో ఎవరు యాక్ట్ చేస్తారు? విలన్‌ ఫేస్‌తో ఎవరు యాక్ట్ చేస్తారని గాంభీరంగా మాట్లాడారట. దీంతో ఏంచేయాలో అర్థం కాలేదని, ఎంతో ఆపాలజీ చెప్పినా వినలేదని, బాగా ఆడుకున్నాడని వెల్లడించింది సుహాసిన. అలా గొడవలతో తమ ఫ్రెండిషిప్‌ ప్రారంభమైందని వెల్లడించింది. అవన్నీ ఇప్పుడు ఎంతో స్వీట్‌ మెమరీస్‌గా మిగిలాయని వెల్లడిచింది. 
 

79

చిరంజీవి మంచి మనసు, గొప్పతనం గురించి చెబుతూ, ఇద్దరు కలిసి `మగమహారాజు` చిత్రంలో నటించారు. విజయ బాపినీడు దర్శకుడు. ఆ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. నెక్ట్స్ మూవీలో రాధికని హీరోయిన్‌గా తీసుకున్నారట. అయితే అదే సమయంలో సుహాసిన ఓ కన్నడ మూవీ చేస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకే చోట జరుగుతున్నాయి. దీంతో చిరంజీవిని చూసి సుహాసిని సెట్‌కి వెళ్లిందట. 
 

89

ఆ సమయంలో అరే ఈ సినిమాలో ఈ అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు. హీరోయిన్‌ని ఎందుకు మార్చారు అన్నారట. దీంతో తనకు ఎంతో అవమానంగా అనిపించిందని, ఏం చెప్పాలో అర్థం కాలేదని తెలిపింది సుహాసిని. అయితే `మగమహారాజు` చిత్ర క్లైమాక్స్ లో మూడు రోజులు షూటింగ్‌కి రాలేదు. దీంతో ఆ కోపంతో తనని తీసుకోలేదట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ బాగా నటిస్తుంది కదా, మూడు రోజులు రాకపోతే టాలెంట్‌ని గుర్తించరా అని చిరంజీవి దర్శకుడిని ప్రశ్నించారట. అంతే నెక్ట్స్ మూవీ `మహారాజు`లో హీరోయిన్‌గా తీసుకున్నారని, అది పెద్ద హిట్‌ అయ్యిందని, అసలు ఈ విషయం ఆయనకు అవసరం లేదు, కానీ చెప్పడం ఆయన గొప్పమనసు నిదర్శనం అన్నారు చిరంజీవి. 
 

99

చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకుడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సోషియో ఫాంటసీగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో చిరు రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఇక సుహాసిని చివరగా తెలుగులో `మిస్టర్ ప్రెగ్నెంట్‌` చిత్రంలో నటించింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved