అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్. కింగ్ నాగార్జున కెరీర్ లో.. మరోసారి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిన బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?
టాలీవుడ్‌లో మన్మధుడిగా అక్కినేని నాగార్జునకు డిఫరెంట్ ఇమేజ్ ఉంది. 90's హీరోలలో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న ఏకైక స్టార్ నాగార్జున మాత్రమే. ఇక మాస్ సినిమాలు చేయడంతో కూడా ఆయన మార్క్ సెపరేట్ గా ఉండేది. నాగార్జున సినిమాల్లో మాస్ ఆడియన్స్ ను ఆకర్శించిన మూవీస్ లో 'మాస్' సినిమా ఒకటి. శివ సినిమా తరువాత ఆ రేంజ్ లో నాగార్జున మాస్ యాక్టింగ్ చూపించిన సినిమా ఇది. 2004లో విడుదలై శివ సినిమాను గుర్తు చేసిన ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది.
మాస్ మూవీని మరోసారి థియేటర్లలో చూడడానికి అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఈసినిమా రీరిలీజ్ డేట్ కు సబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. 'మాస్' సినిమాను సెప్టెంబర్ 12న రీ-రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా రీ-రిలీజ్ కోసం సినిమా ప్రింట్‌ను రీమాస్టర్ చేయబోతున్నట్టు సమాచారం. ఇలా చేయడం ద్వారా ఫ్యాన్స్ థియేటర్ లో మాస్ సినిమాను ఇంకాస్త ఎక్కువగా ఎంజయ్ చేయబోతున్నారు.

విజ్యువల్ క్వాలిటీ కాని, సౌండ్ ఎఫెక్ట్స్ ను అన్నింటిని సరిచేసి బెస్ట్ క్వాలిటీ ప్రింట్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ రీ-రిలీజ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. థియేటర్లలో విడుదలకు ముందు అభిమానులను ఆకర్షించడానికి ప్రమోషన్స్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది . ఇక అక్కినేని ఫ్యాన్స్ ఈ రీ-రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
