అఖిల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమించిన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు అక్కినేని అఖిల్. ఇక ఈ క్రమంలో కొడుకు పెళ్లి సందర్భంగా సంబరంతో డాన్స్ చేశారు నాగార్జున. ఇద్దరు కొడుకులతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు.
అక్కినేని వారసుడు, నాగార్జున చిన్న తనయుడు అఖిల్ వివాహం శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఘనంగా జరిగింది. చాలా కాలంగా తాను ప్రేమించిన ప్రేయసి జైనబ్ మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు అఖిల్. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా పేజ్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు .
ఇక ఈ పెళ్లికి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొద్ది మంది అతిథులు, స్నేహితుల మధ్య పెళ్లి వేడుకు అద్భుతంగా జరిగింది.
ఇక ఈ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అక్కినేని సెలబ్రిటీల డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందులో భాగంగా జరిగిన సంగీత్ ఫంక్షన్‌లో నాగార్జున, అఖిల్, నాగచైతన్య ముగ్గురు కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగార్జున తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేయగా, అఖిల్, చైతూ నాగార్జునతో కాలు కదిపారు.
ఇద్దరు కొడుకులతో కలిసి నాగార్జున చేసిన డాన్స్ కు అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఇక గత ఏడాది నవంబర్ 26న అఖిల్, జైనాబ్ ల నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో కూడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి ఫొటోలు కూడా అదే రీతిలో నాగార్జున తన ఖాతా ద్వారా షేర్ చేశారు.
అఖిల్, జైనబ్ జంటను చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.ఇక వీరికి సోషల్ మీడియా ద్వారా సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి తెల్లవారుజామున జరగడంలో.. రిసెప్షన్ ను మాత్రం గ్రాండ్ గా ఏపర్పాటు చేయబోతున్నారు అక్కినేని ఫ్యామిలీ. ఈనెల 8న హైటెక్స్ లో వీరిరిసెప్షన్ జరగబోతున్నట్టు సమాచారం.