నాగార్జున, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నరా.?

Nagarjuna and kalyan ram both to act in a movie
Highlights

నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో నాగార్జున

ఇటీవల కల్యాణ్ రామ్ హీరోగా చేసిన సినిమాలు ఆయనకి పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆయన తన సొంత బ్యానర్లో తనే హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇది మల్టీ స్టారర్ మూవీ అని తెలుస్తోంది.

ఒక కథానాయకుడిగా చేయనున్న కల్యాణ్ రామ్ .. మరో హీరోగా నాగార్జున అయితే బాగుంటుందని భావించాడట. ఆ వెంటనే నాగ్ కి కథ చెప్పడం .. ఆయన ఓకే అనడం జరిగిపోయాయి. ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ .. ఆ కొత్తదనం కారణంగానే ఆయన కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున .. నానితో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, కల్యాణ్ రామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.  

loader