నా మార్పుకి కారణం శ్రీదేవి

Nagarjuna about sridevi
Highlights

నా మార్పుకి కారణం శ్రీదేవి

శ్రీదేవి మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకురావడమేకాదు, ఆమె మరణం తనకు జీవిత పాఠం నేర్పిందని మనసులోని మాటని బయటపెట్టాడు నాగార్జున. అయినవాళ్లని మరింత దగ్గరయ్యేలా చేసిందన్నాడు. శ్రీదేవి చనిపోయి ఇన్ని రోజులవుతున్నా ఆమె స్మృతులు సినీప్రముఖులను వెంటాడుతూనే ఉన్నాయన్నాడు. శ్రీదేవి మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపాడు. సౌత్‌తోపాటు బాలీవుడ్‌లో నటిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి, పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేమని అన్నాడు.

అదే సమయంలో వర్మ డైరెక్షన్‌లో శ్రీదేవితో తాను నటించిన ‘గోవిందా గోవింద’ చిత్రం గురించి కొన్ని విషయాలను ప్రస్తావించాడు నాగ్. ఈ చిత్రం షూట్ జరిగేటప్పుడు శ్రీదేవి కెమెరా ముందు చాలా హ్యాపీగా ఉండేవారని, కెమెరా స్విచ్చాఫ్ చేస్తే ఆమె తన రియల్ లైఫ్‌లోకి వచ్చేవారని గుర్తుచేశాడు. తాను నటిస్తున్నంత కాలం శ్రీదేవిని మిస్ అవుతూనే ఉంటానంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. వర్మ డైరెక్షన్‌లో నాగ్ నటించిన ‘ఆఫీసర్’ మూవీ జూన్ ఒకటిన రానుంది.

loader