పవన్ కల్యాణ్ పై మెగా బ్రదర్ నాగబాబు మనోగతం మెగా ఫ్యాన్ పోర్స్ అంతా పవన్ కళ్యాణ్ వెంట వుందన్న నాగబాబు పవన్ సీఎం అయితే మంచి జరుగుతుందన్న నాగబాబు బాబు, వైఎసార్ లకు సీఎం అయేందుకు ఎంతో కాలం పట్టింది కదా-నాగబాబు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కాక జనసేన పార్టీతో రాజకీయంగానూ ఏ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ వున్న లీడరో చూస్తునే వున్నాం. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, అతని సత్తా గురించి మెగాబ్రదర్ తనదైన శైలిలో విశ్లేషించారు. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటేనని.. మెగా ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వుంటారని.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్సేనని.. అంతా మా వాళ్లేనని చెప్పుకొచ్చారు. మెగా కుటుంబానికి సంబంధించిన మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ అంతా ఒక్కటేనన్నారు. తమ హీరోల సినిమాలు రిలీజైతే థియేటర్స్ కి వెళ్లి ప్రతి సినిమా ఆరేడు సార్లు చూస్తారన్నారు.

ఇక రాజకీయంగా పవన్ కల్యాణ్ సత్తా చాటుతాడనే నమ్మకం తనకుందన్నారు. ఇక తమ అభిమానులు కొందరు విమర్శలు చేస్తుంటారని, నన్ను పవర్ స్టార్ ను ఇలా అంటావా అని అడుగుతారని.. అయితే... అరేయ్.. కల్యాణ్ నా తమ్ముడురా.. నేనెందుకంటా అని చెప్తానన్నారు. మరోవైపు బన్నీ కూడా తమవాడే కదా అని, బన్నీ మనం అందరం ఒకటే అన్నాడు తప్ప మరోలా అనలేదని నాగబాబు చెపారు. బన్నీ మాట్లాడినప్పుడు ఒక్కసారి కళ్యాణ్ బాబు గురించి చెప్పను అనడం ఆవేశంలో అన్నాడని సమర్థించారు. తెలిసో తెలీకో అన్నాడని.. అది టంగ్ స్లిప్ తప్ప మరేం కాదన్నారు. అయినా మళ్లీ సరిచేసుకుని చెప్పాడన్నారు.

ఇక ప్రస్థుత రాజకీయాల గురించి మాట్లాడిన నాగబాబు పీఆర్పీలో కార్యకర్తగా పనిచేసిన అనుభవం వుంది కాబట్టి నేను పవన్ తో కలిసి పనిచేయటానికి రెడీ అన్నారు. అయితే ఎన్నికల వరకు మద్దతిస్తాను కానీ ఎన్నికలయ్యాక నా లైఫ్ నాది అన్నారు. పవన్ అడిగినా అడగకున్నా తాను ఎలాగైనా మద్దతిస్తానన్నారు.

అన్నయ్య రాజకీయాలకు దూరంగా వున్నా... మెగా ఫ్యాన్స్ అనేది ఒక ఫోర్స్ అని.. అందరం కళ్యాణ్ బాబుకు మద్దతిస్తామని అన్నారు. ప్రస్థుతం అన్నయ్య వల్ల కొంత మంది ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో వున్నారు. నేను ఇండైరెక్ట్ గా మెగా ఫ్యాన్స్ అందరినీ కళ్యాణ్ బాబుకు పరిచయం చేశాను. కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తితో పని చేయాల్సిన అవసరం వుంది. దేశానికి ఉపయోగపడతాడని చెప్పి పంపాను. 90 శాతం మెగా ఫ్యాన్స్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలిచారు. 10 శాతం ఫ్యాన్స్ కు మాత్రమే వేరే కారణాలు వుండొచ్చన్నారు.

అంతే కాదు.. అసలు అడ్డంగా దోచుకుని, మోసం చేసి, నేరాలు, మాఫియా, దుర్మార్గాలు చేసి ఎంతో మంది రాజకీయాల్లో ఉన్నత పదవులు ఆశిస్తుంటే మంచికి మారుపేరు, ధైర్యం, నిజాయితీ వున్నోడు కళ్యాణ్ కు ఎందుకు లేదు. అండర్ డాగ్ ఛాంపియన్ అవలేడా. సర్వేల పేరుతో తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీలకే మద్దతు అంటూ కొందరు చెప్పారు.

కానీ కల్యాణ్ బాబుకు జనం మద్దతు అండర్ లైన్ లో ఎంత ఫాలోయింగ్ వుందో మాకు తెలుసు. దాన్ని బైటికి చెప్తే దొరికిపోతామని కొందరు చెప్పట్లేదు. అలాంటి ఫాలోయింగ్ ఎంజీఆర్, రాజ్ కుమార్, ఎన్టీఆర్ లకు వుండేది. అన్నయ్య చిరందీవికి వుంది. అది నటుడుగానే. అయితే వ్యక్తిగతంగా కూడా కళ్యాణ్ మరింత స్కోర్ చేశాడు. అది చాలా డిఫరెంట్ ఫాలోయింద్. తెలుగు పరిశ్రమలో ఎవరికీ ఆ ఫాలోయింగ్ లేదు. కళ్యాణ్ పేరు చెబితే పూనకం వస్తుంది. అతని పాజిటివ్ నెస్ మీడియాలో కనిపిస్తున్నాయి. అతన్ని వ్యక్తిగతంగా విమర్శించే పిచ్చకారణాలు తప్ప మరేం లేదు. అలాంటి ఇమేజ్ వున్నోడు సీఎం అయితే తప్పేంటి. అసలు అలాంటి వాడే సీఎం అవాలి. మనుషులు బాగుండాలని ఆలోచించే కళ్యాణ్ అయితే తప్పేం లేదు. 2019లోనే అవుతాడేమో. కాకుంటే మరి కొంత కాలం పడుతుందేమో.. అయినా చంద్ర బాబుకు, రాజశేఖర్ రెడ్డికి ఎంత కాలం పట్టిందో చూశాం కదా. హత్యా రాజకీయాలు, కుళ్లు కుతంత్రాలు చేస్తున్న వారే పదవులకు ఆశిస్తుంటే.. పోరాడి నిలబడే సత్తా ధైర్యం వున్న నాయకుడు సీఎం అవ్వాలనుకుంటే తప్పేంటి. అలాంటి కోరిక అతనికి వుండాలి. అంటూ నాగబాబు తనదైన శైలిలో చెప్పారు.

అయితే పవన్ కల్యాణ్ కు అధికారం చెలాయించాలనే కోరికలేదన్నారు. మంచి పొజిషన్ వస్తే మంచి చేయొచ్చనే స్వార్థం తప్ప మరేం లేదన్నారు. కళ్యాణ్ బాబుకు తను సీఎం అవాలనే కోరిక వుండాలి అని.. ఆ అవసరం వుందని నాగబాబు అన్నారు.

ప్రజా రాజ్యం, జనసేనలని పోల్చి చూసినప్పుడు అది ఆ పార్టీల అధినేతల మనస్తత్వాన్ని బట్టి నడిచాయన్నారు. అన్నయ్య చిరంజీవి చాలా కష్టపడి పైకొచ్చారు. అన్నయ్య పెద్ద కొడుకు. బాధ్యతలుంటాయి. నిర్ణయం తీసుకోవాలన్నా అచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సందర్భంలో ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. దూకుడు తత్వం లేదు. అన్నయ్యది వెయిట్ అండ్ సీ పాలసీ. కానీ మెజారిటీ సభ్యుల అంగీకారంతోనే కాంగ్రెస్ లో విలీనం చేశారు. అది తప్పా ఒప్పా అని ఇప్పుడు చర్చించడం దండగ. దానిపై ఎనాలిసిస్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

అయితే.. జనసేన అధినేత... కళ్యాణ్ బాబుది దూకుడు తత్వం.. అగ్రెసివ్. అంటే నెగెటివ్ కాదు. తర్వాత ఏంటి అని ఆలోచించకుండా ముందుకెళ్లే డాషింగ్ పర్సనాలిటీ. దేనికైనా నిలబడతాననే దమ్మున్న వ్యక్తి. ఎగ్రెసివ్. పని చేద్దామంటే చేయాల్సిందే. అనుకుంటే చేసి తీరతాడు. ఆలోచించి ఏదీ చేయడు. పది మందికి ఉపయోగపడుతుందంటే... ఏ పనికైనా వెనుకాడడు. అని చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక విమర్శకులని మనం అలాగే వదిలేస్తే.. తప్పు మనదే అవుతుంది. మనల్ని ఎవడన్నా దూషిస్తుంటే భరించడం ముమ్మాటికీ తప్పేనన్నారు.