దయచేసి ఈ సినిమాకి రేటింగ్ లు ఇవ్వకండి

Naga Shourya Urges media not to give ratings to this movie
Highlights

దయచేసి ఈ సినిమాకి రేటింగ్ లు ఇవ్వకండి

'ఛలో’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య అదే జోష్‌తో ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుంద‌ర్ సూర్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘అమ్మమ్మగారిల్లు’ టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన  డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ టీజ‌ర్‌ను ఆవిష్క‌రించి యూనిట్‌కి శుభాకాంక్షల్ని అందించారు. ఈ సందర్భంగా నాగ శౌర్య మాట్లాడుతూ.. అమ్మ‌మ్మ‌గారిల్లు ఒక గుడిలాంటింది. 

గుడికి వెళ్లిన‌ప్పుడు శ‌త్రువులు ఎదురైనా ద‌ర్శ‌నం చేసుకుని వ‌స్తాంగానీ.. అలాంటి చోట త‌గాదాలు ప‌డం. అలాగే అమ్మ‌మ్మ‌గారి ఇంటికెళ్లిన‌ప్పుడు కుటుంబంలో వ్య‌క్తుల మ‌ధ్య‌ మ‌నస్ఫ‌ర్ధ‌లున్నా బ‌య‌ట‌కి న‌వ్వుతూ ఉంటాం. కార‌ణం అమ్మ‌మ్మ బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని. అలాంటి పాత్ర‌ల‌తో చిత్రీక‌రించిన సినిమా ఇది. నాకు మా అమ్మ‌మ్మ ఇంటితో చాలా అనుబంధం ఉండేది. మ‌ళ్లీ ఆ జ్ఞాప‌క‌ల‌న్నీ ఈ సినిమా గుర్తుచేసింది. సినిమా బాగా వ‌చ్చింది. ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం ప్రతి వ్యక్తి జ్ఞాప‌కాలతో ముడిపడిందని దయచేసి ఇలాంటి చిత్రానికి రేటింగ్ ఇవ్వొద్దని మీడియాను కోరారు.  షామిలీ మంచి కోస్టార్. ఆమె 15 ఏళ్ల క్రిత‌మే న‌టిగా నిరూపించుకున్నారు. ఆమె గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నిర్మాత‌లు చాలా ఫ్యాష‌న్‌తో సినిమా చేశారు. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా’ అన్నారు నాగశౌర్య. 
 

loader