బ్యాచిలర్ పార్టీలో నన్ను చేర్చుకో.. హీరోకి నాగచైతన్య రిక్వెస్ట్

Naga Chaitanya wants to be part of a bachelor party
Highlights

ఈ ఇన్విటేషన్ కేవలం బ్యాచిలర్స్ కు మాత్రమేనా..? ఎలాగోలా నన్ను కూడా మీ పార్టీలో చేర్చుకో. నాలో బ్యాచిలర్ ఇంకా బతికే ఉన్నాడు

అక్కినేని నాగచైతన్య.. సమంతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తనలో బ్యాచిలర్ ఇంకా బతికే ఉన్నాడని తనను కూడా బ్యాచిలర్ పార్టీలో చేర్చుకోమని నటుడు తన బావ అయిన సుశాంత్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు నాగచైతన్య. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ 'చిలసౌ' అనే సినిమాను రూపొందించారు.

ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని సుశాంత్ వెల్లడించాడు. 'హలో సింగిల్ బాయ్స్ అండ్ గర్ల్స్.. మీ అందరినీ నా బ్యాచిలర్ పార్టీకు ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. పెళ్లి నుండి తప్పించుకోవడానికి మీ పేరెంట్స్ కు ఎలాంటి సాకులు చెబుతారో లింక్ లో అప్లికేషన్ పత్రంలో రాసి నాకు పంపండి. మంచి సమాధానాలు చెప్పిన వారిని ఎంపిక చేసి విజేతలుగా ప్రకటిస్తాం. వారికి సినిమా ఒకరోజు ముందే చూపిస్తాం' అని ఓ ట్వీట్ చేశాడు.

దీనికి సమాధానంగా చైతు.. 'ఈ ఇన్విటేషన్ కేవలం బ్యాచిలర్స్ కు మాత్రమేనా..? ఎలాగోలా నన్ను కూడా మీ పార్టీలో చేర్చుకో. నాలో బ్యాచిలర్ ఇంకా బతికే ఉన్నాడు' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన సమంత.. 'మీరు ఇంకా బ్యాచిలర్ అనే అంటున్నారా హస్బెండ్' అని రిప్లై చేసింది

 

 

loader