టాలీవుడ్ హాట్ కపుల్ సమంత,నాగచైతన్య మరి కొన్ని రోజుల్లోనే ఒక్కటవబోతున్నారు. వీళ్ల వివాహం గోవాలో అక్టోబర్ 6న హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. అనంతరం 7వ తేదీన క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇప్పటికే పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేసేందుకు అక్కినేని ఫ్యామిలీ గోవాకు చేరుకుంది.

 

ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులైన ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. పెండ్లి పిలుపు అందుకున్న వారిలో.. రామ్ చరణ్ దంపతులు, వెంకటేష్, రానా, రాహుల్ రవీంద్ర, చిన్మయి తదితర కుటుంబసభ్యులు మిత్రులు వున్నారు. ఇక అత్యంత సాధారణంగా నిర్వహించనున్న ఈ పెళ్లి ఖర్చు కేవలం రూ.10 కోట్లేనట.

 

ఇంత సింపుర్ గా వివాహ వేడుక జరుపుకుంటున్న ఈ జంట ఈ 150 మంది గెస్టుల ఫ్లైట్ టికెట్స్ ఖర్చులు కూడా భరించనున్నారట. ఈ వివాహ వేడుక అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రముఖులు, స్థానిక అభిమానుల కోసం రిసెప్షన్ ఏర్పాట్లు చేయనున్నారు. మరి పెళ్లి 10 కోట్లలో ముగించేస్తున్న చైతూ, సామ్ దంపతులు ఈ వివాహ వేడుకను ఎంత అందంగా మలచనున్నారో వేచి చూడాలి.