రాఖీ పౌర్ణమి సందర్భంగా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన నాగచైతన్య ప్రస్థుతం నాగ చైతన్య నటిస్తున్న చిత్రం యుద్ధం శరణం రాఖీ సందర్భంగా గిఫ్ట్ గా ఈ మూవీలోని ఎన్నో ఎన్నో భావాలే లిరికల్ వీడియో
సోదరసోదరీమణుల బంధానికి ప్రతిరూపంగా జరిగేదే రాఖీ పండుగ. దేశ వ్యాప్తంగా ఘనంగా రాఖీ పండుగ జరిగింది. అయితే రాఖీ పౌర్ణమికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్పెషల్ గా ఏదీ రాలేదు అనుకుంటున్న సందర్భంగా అక్కినేని నాగచైతన్య.. ఓ అద్భుతమైన గిఫ్ట్ అందించారు అభిమానుల కోసం..అక్కా చెల్లెళ్ల కోసం. ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యుద్ధం శరణం’.
ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయ్యాయి. ‘యుద్ధం శరణం’ పేరు కాస్త వాయిలెంట్ గా ఉన్నా అద్భుతమైన సెంటిమెంట్, ఎమోషనల్ సీన్లు ఉన్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. తాజాగా రక్షాబంధన్‌ని పురస్కరించుకుని ఈ సినిమాలోని ‘ఎన్నో ఎన్నో భావాలే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ పాటలో నాగచైతన్యకు.. తన ఇద్దరు చెల్లెళ్లు రాఖీ కడుతుండగా..‘రాఖీ ఎందుకు కడతారో తెలుసా? అక్కాచెల్లి బాధ్యత.. అమ్మానాన్నల తర్వాత అన్నాదమ్ములదేనని ప్రతి నిమిషం గుర్తుచేయడానికి’ అని రేవతి చెప్తున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
ఈ ఒక్క సీన్ చూస్తే చాలు సినిమా లో బొలెడంత సెంటిమెంట్ దాగి ఉందని అర్థమవుతుంది. అంతే కాదు ఈ రోజు రాఖీ పౌర్ణమి కనుక పాట కూడా అద్భుతంగా ఉండటంతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఒకరకంగా చెప్పాలంటే..నాగ చైతన్య పాటతోనే ఈ సినిమాకి మంచి హైప్ ని తీసుకువచ్చాడు.

