వేరే ఆప్షన్ లేక సమంతను పెళ్లి చేసుకున్నా.. చైతూ కామెంట్స్

Naga Chaitanya  Funny Comments on Samantha
Highlights

సమంతను నేను ఏడేళ్లుగా ప్రేమిస్తే ఫైనల్ గా పాపం సీరియస్ గా ప్రయత్నిస్తున్నాడని రెండేళ్ల క్రితం ఓకే చేసింది. అప్పటినుండి ప్రేమించుకుంటున్నాం. కానీ పదేళ్లకు పెళ్లి చేసుకోవాల్సివచ్చింది. వేరే ఆప్షన్ లేక

అక్కినేని నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సమంతను వేరే ఆప్షన్ లేక పెళ్లి చేసుకున్నానని చైతు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన 'చిలసౌ' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు.

అయితే సుశాంత్ తమ కుటుంబ సభ్యుడు కావడం, రాహుల్ రవీంద్రన్.. సమంత మంచి స్నేహితులు కావడంతో చైతు-సమంత స్పెషల్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా విలేకర్ల సమావేశంలో ఈ జంట పాల్గొన్నారు. ముందుగా రాహుల్ రవీంద్రన్ తన ప్రేమ సంగతులు, పెళ్లి విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ తరువాత చైతు తన ప్రేమ గురించి చెబుతూ..

''సమంతను నేను ఏడేళ్లుగా ప్రేమిస్తే ఫైనల్ గా పాపం సీరియస్ గా ప్రయత్నిస్తున్నాడని రెండేళ్ల క్రితం ఓకే చేసింది. అప్పటినుండి ప్రేమించుకుంటున్నాం. కానీ పదేళ్లకు పెళ్లి చేసుకోవాల్సివచ్చింది. వేరే ఆప్షన్ లేక'' అంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో సమంత 'అందరూ అయిపోయిన తరువాత చైతు లాస్ట్ కి నా దగ్గరకి వచ్చాడు. చివరి టోకెన్ నాదే' అంటూ చమత్కరించారు.  

loader