Asianet News TeluguAsianet News Telugu

Naga Babu Supports Rgv : రామ్ గోపాల్ వర్మకు నాగబాబు సపోర్ట్..ఎం చెప్పారంటే..?

రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma)  నాగబాబు(Naga Babu).. ఉప్పు నిప్పు. వర్మ పేరు ఎత్తితేనే మెగా బ్రదర్ చిర్రెత్తుకొస్తాడు. అటువంటిది వర్మకు సోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు నాగబాబు. నువ్వే కరెక్ట్ అంటూ నిక్కచ్చిగాచెప్పాడు. ఇంతకీ ఏ విషయంలో వర్మకు నాగబాబు సపోర్ట్ చేశారు...?

Naga Babu supported Ram Gopal Varma  comments
Author
Hyderabad, First Published Jan 5, 2022, 9:05 AM IST

రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma)  నాగబాబు(Naga Babu).. ఉప్పు నిప్పు.. వర్మ పేరు ఎత్తితేనే మెగా బ్రదర్ చిర్రెత్తుకొస్తాడు. అటువంటిది వర్మకు సోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు నాగబాబు. నువ్వే కరెక్ట్ అంటూ నిక్కచ్చిగాచెప్పాడు. ఇంతకీ ఏ విషయంలో వర్మకు నాగబాబు సపోర్ట్ చేశారు...?

రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) - నాగబాబు(Naga Babu)...వీరిద్దరు ఉప్పు నిప్పు. వర్మ పేరు ఎత్తితేనే నాగబాబుకు కోపం వచ్చేంత ఇష్యూస్ నడిచాయి వీరి మధ్య. మెగా ప్యామిలీ మీద సినిమాలు..రకరకాల కామెంట్లు చేయడం వల్ల.. వర్మ మీద నాగబాబు(Naga Babu) గట్టిగానే ఫైర్ అయ్యారు గతంలో. పిచ్చి పిచ్చిగా తిట్టి వదిలిపెట్టారు. సోషల్ మీడియాలో కడిగిపడేశారు. అటు వర్మ కూడా తనదైన మార్క్ ఆన్సర్స్ తో సెటిల్డ్ గా ఇష్యూను. అందరూ షాక్ అయ్యేలా.. వర్మ కు సపోర్ట్ గా నాగబాబు (Naga Babu)పోస్ట్ పెట్టారు. ఆయన చేసిన పనిని మెచ్చుకున్నారు. అద్భుతం వర్మా అంటూ ఆకాశానికి ఎత్తారు. ఇంతకీ ఏ ఇష్యూలో వీరిద్దరు కలిసిపోయారు. అంతలా వర్మను నాగబాబు పొడగాల్సిన అవసరం ఏమోచ్చింది. 

ఏపీ ప్రభుత్వం -ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య టికెట్ రేట్ల ఇష్యూ నడుస్తుంది. ఈ విషయం పై అందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma)   కూడా తనదైన స్టైల్లో కామెంట్లు చేశారు. కామెంట్లు చేశారు అనడం కంటే.. విరుచుకుపడ్డారు అనడం కరెక్టర్. ఎందుకంటే సినిమాకు నిత్యవరసర వస్తువకు సంబంధం ఏంటీ..? సినిమాల టికెట్ల రేట్లు మీరు ఎలా కంట్రోల్ చేస్తారంటూ.. రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma)   ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పండంటూ.. ఇండస్ట్రీ స్టాండ్ తానోక్కడే తీసుకుని గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు వర్మ.

రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma)   సోషల్ మీడియాలో వదిలిన 10 ప్రశ్నలకు.. మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) సపోర్ట్ చేశాడు. బాగా అడిగావ్ వర్మా.. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం అన్నారు. తన మనస్సులో ఏముందో..? తాను ఏమి అడగాలి అనుకున్నానో.. అవే ప్రశ్నలు పొల్లు పోకుండా అడిగేశావ్ శభాష్ అంటూ నాగబాబు వర్మ గురించి ట్వీట్ చేశారు. అంతే కాదు వర్మకు సపోర్ట్ చస్తూ..ఆయన ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు నాగబాబు. దాంతో నోరెళ్లబెట్టడం నెటిజన్ల వంతు అయ్యింది.

 

నాగబాబు సపోర్ట్ కు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma)   కూడా ఖుషీ అయ్యాడు. మెగా బ్రదర్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్యూ నాగబాబు(Naga Babu) గారు. మీలాగే ఇండస్ట్రీలో మిగతావరు కూడా తనకు  సపోర్ట్ చేస్తూ.. ముందుకు వస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ అంశం పై మరింత మంది ముందుకు రావాలని కోరుకున్నారు. ఇక ట్వటిట్టర్ లో వీరి కలయిక చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Prabhas Visited Sirivennela Home: సిరివెన్నెల కుటుంబాన్ని పరామర్శించిన ప్రభాస్.. స్వయంగా ఇంటికి వెళ్లి..

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios