వినోదపు పన్ను రాయితీ విధివిధానాలకు కమిటీ ఏర్పాటు

n shankar committe for entertainment tax subsidy
Highlights

  • వినోదపు పన్ను రాయితీలకు సినిమాలను నిర్ణయించే కమిటీ
  • ఎన్.శంకర్, రామ్మోహన్ రావు, మురళీ మోహన్ రావులతో కమిటీ

రాష్ట్రంలో నిర్మించే ప్రధాన సినిమాలకు, బాలల సినిమాలకు వినోదపు పన్ను రాయితీ సర్టిఫికెట్ అందించేందుకు నూతన కమిటీని నియమిస్తూ.. తెలంగాణ ఐ అండ్ పీఆర్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న మార్గదర్శకాలను పునఃసమీక్షించి కొత్త విధానాలు రూపొందించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ లో.. దర్శకుడు శంకర్, పి.రామ్మోహన్ రావు, కె.మురళీ మోహన్ రావు, రెవెన్యూ శాఖ ప్రత్యేక అధికారి, కమర్షియల్ టాక్స్ శాఖకు చెందిన నామినీ కమిషనర్, పరిశ్రమ శాఖ మహిళా ప్రతినిథి రేవతి గౌడ్, టీఎఫ్డీసీ ఎండీ, జాయింట్ ఎండీ సభ్యులుగా ఉన్నారు.

loader