దర్శకుడిపై అతడి భార్యకు అనుమానం.. డైరెక్టర్ ఏం చేశాడంటే..?

my wife had doubt on me says director parasuram
Highlights

 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా విడుదలై రెండేళ్లు పూర్తవుతున్నా.. 'గీత గోవిందం' విడుదల కావడం లేదని ఇంత ఆలస్యమవుతుండడం పట్ల చాలా మందికి సందేహాలు వచ్చాయని ఆయన అన్నారు. చివరి అతడి భార్య కూడా తనని అనుమానించినట్లు వెల్లడించారు

టాలీవుడ్ లో 'సోలో','శ్రీరస్తు శుభమస్తు' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు పరశురామ్ కెరీర్ ఒక హిట్టు, ఒక ఫ్లాపు అన్నట్లుగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ హీరోగా 'గీతగోవిందం' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం తను చాలా సమయం తీసుకున్నట్లు దర్శకుడు పరశురామ్ వెల్లడించారు.

'శ్రీరస్తు శుభమస్తు' సినిమా విడుదలై రెండేళ్లు పూర్తవుతున్నా.. 'గీత గోవిందం' విడుదల కావడం లేదని ఇంత ఆలస్యమవుతుండడం పట్ల చాలా మందికి సందేహాలు వచ్చాయని ఆయన అన్నారు. చివరి అతడి భార్య కూడా తనని అనుమానించినట్లు వెల్లడించారు. తాను రోజు గీతాఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లేవాడినని, కానీ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకి రాకపోవడంతో తన భార్య అనుమానించి సినిమా ఆఫీస్ అని చెప్పి మరెక్కడికైనా.. వెళ్తున్నాడేమోనని అనుకుందని చెప్పి నవ్వేశాడు.

సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకున్న కారణంగా సినిమా ఆలస్యంగా విడుదల అవుతుందని అన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. 

loader