Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి అనే ఈ ఉమ్మడి కుటుంబ కథ.. చక్కని కుటుంబ విలువలని చూపిస్తూ మంచి రేటింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. అంతేకాకుండా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈరోజు మార్చి 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం
ఎపిసోడ్ ప్రారంభంలో ఈమధ్య నీ పెళ్ళానికి నోరు ఎక్కువయింది సొంత పెళ్ళాం అయిపోయినట్లుగా మాట్లాడుతుంది కొంచెం లిమిట్స్ లో ఉండమను అంటుంది ముకుంద. లిమిట్స్ అంటే ఏంటి మా శోభనం గది తలుపు తట్టడమా? సొంత పెళ్ళాం లాగా మాట్లాడుతుంది అన్నావు మరి నువ్వేంటి నేనేదో నీ సొంత భర్త లాగా ప్రవర్తిస్తున్నావు మా ఇద్దరిదీ అగ్రిమెంట్ మ్యారేజ్ కావచ్చు. కానీ ఆమెకు నేను తాళి కట్టాను. తను నా దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా నా భార్యనే అవుతుంది.
నా పెళ్ళామనే అంటారు కదా. నన్నంటే పడతాను ఎందుకంటే నా వల్ల మీ జీవితం ప్రశ్నార్ధకంగా మారిపోయింది. కానీ నా భార్యను అంటే ఊరుకోను అంటూ కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి. ఆ మాటలకి షాక్ అయిపోతుంది ముకుంద. మరోవైపు కూరలు కట్ చేస్తున్న సౌండ్ కి నిద్రలేస్తాడు మురారి. ఏంటి ఇవన్నీ అని అడుగుతాడు. వీటిని కాయగూరలు అంటారు అంటూ పెద్ద లిస్టు చదువుతుంది. ఏమైంది నీకు అని మురారి అడిగితే బ్రెయిన్ వాష్ అయింది అంటుంది కృష్ణ.
ఎవరు బ్రెయిన్ వాష్ చేశారు అని అడిగితే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాకుండా అందరూ చేశారు ఎందుకంటే నేను ఒక తింగరిదాన్ని దొరికాను కదా అంటుంది కృష్ణ. అది నిజమే కదా లేకపోతే బెడ్ ని రైతు బజారుగా మార్చేస్తావా అంటాడు మురారి. నన్ను వంటలక్కలాగా మార్చేస్తున్నారు ఈ ఇంట్లో వాళ్ళు అంటుంది కృష్ణ. ఒకసారి నువ్వు వండిన వంట పెట్టు జీవితంలో మళ్ళీ వండమనరు అంటూ ఆట పట్టిస్తాడు మురారి. ఆ వంట నేను కూడా తినాలి కదా అలాంటి ప్రాణాంతకమైన పనులు నేను చేయను అంటుంది కృష్ణ.
నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావు అంటాడు మురారి. నేను క్లారిటీ గానే ఉన్నాను కానీ ముకుందా లోనే ఏ క్లారిటీ లేదు అంటుంది కృష్ణ. ఏం జరిగింది అని మురారి అడిగితే భవాని దగ్గర తనని ముకుంద ఇరికించేసిన సంగతి చెప్తుంది కృష్ణ. నేను వెళ్లి పెద్దమ్మకి చెప్పనా అంటే వద్దు ఇండియాలో పాలిటిక్స్ కన్నా ఇంట్లో పాలిటిక్స్ కే చాలా పవర్ ఉంది అని అర్థమైంది అంటుంది కృష్ణ. అయితే ఈ కూరగాయలు కట్ చేయాలా అంటాడు మురారి.
అవును మా సీనియర్ డాక్టర్ ఉన్నాడు కదా ఒక పెద్ద టాస్క్ ని ఇచ్చాడు అంటూ మురారి కి చూపించి గోలపెడుతుంది కృష్ణ. దీన్నే డబల్ ధమాకా అంటారు మురారి. నేను రికార్డ్స్ రాస్తాను నువ్వు వెజిటేబుల్స్ కట్ చెయ్యు అని మురారి అంటే వద్దు అంత పని చేయకండి ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ మారిందని మా సీనియర్ డాక్టర్ గుర్తుపడితే నన్ను ఏ మార్చరీకో ఇన్చార్జిగా వేసేస్తారు అంటుంది కృష్ణ. శాడిస్ట్ అనమాట అని మురారి అంటే కాదు మంచి మనిషే పది లక్షలు అవ్వవలసిన ట్రీట్మెంట్ ని పదివేల లో పూర్తి చేసేశారు అంటుంది.
నాలాగా సిన్సియర్ అన్నమాట అని నవ్వుతాడు మురారి వెజిటబుల్స్ నేను కట్ చేస్తాను అని మురారి అంటే సిటీని గడగడలాడించే కెసిపి సార్ కూరగాయలు కట్ చేస్తే బాగోదేమో అంటుంది కృష్ణ. గదిలోకి వచ్చి ఎవరు చెక్ చేయరుగాని, నువ్వు లెగు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయకపోతే మీ శాడిస్ట్ సీడీ ఇంకొక పనిష్మెంట్ ఇస్తాడేమో అని భయపడతాడు మురారి. మురారి కి థాంక్స్ చెప్పి తను రికార్డ్స్ రాసుకుంటూ ఉంటుంది. మురారి వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే అవి ప్లేట్లో కాకుండా ఎగిరి ఎక్కడెక్కడో పడుతూ ఉంటాయి.
రెండు మొక్కలు ఆమె నెత్తి మీద పడితే కోపంతో నా బుర్ర ఏమైనా హాకీ గ్రౌండ్ అనుకున్నారా అంటే కేకలు వేస్తుంది కృష్ణ. కూరగాయలు కట్ చేయడం కూడా ఒక కళే అని నవ్వుతాడు మురారి. వెజిటబుల్స్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను అంటూ దగ్గరుండి చేయి పట్టుకొని అతని చేత వెజిటేబుల్స్ కట్ చేయిస్తూ ఉంటుంది. ఇద్దరూ ఆ పనిని ఎంజాయ్ చేస్తారు. మరోవైపు మంచి నిద్రలో ఉన్న మురారి కి కృష్ణ ఫోన్ చేసి కూరగాయలు కట్ చేసి అలిసిపోయినట్లుగా ఉన్నారు అందుకే టేబుల్ మీద ఒకటి పెట్టాను చూడండి అంటుంది.
అక్కడ ఏమీ లేదు అంటే బెడ్ పక్కన ఉందేమో చూడండి అంటుంది. నేను కోటు, స్కేతస్కోప్ ఇచ్చానని నువ్వు కూడా అలాంటిదేదో ప్లాన్ చేసావా ఎక్కడున్నావు నువ్వు అంటాడు మురారి. అప్పుడే మంచం వెనుక నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాను పాపం 4:30కే లేచి కూరగాయలు కట్ చేసి అలిసిపోయారు అంటూ ఒక గిఫ్ట్ ఇస్తుంది కృష్ణ. ఏంటి ఎక్సేంజ్ ఆఫర్ నేను నీకోసం కోర్టు స్టెతస్కోపు కొన్నందుకు నువ్వు నాకు పెన్ గిఫ్ట్ ఇస్తున్నావా అంటాడు మురారి.
మీ గుర్తు నా దగ్గర ఉంది కదా మరి నా గుర్తు మీ దగ్గర ఉండాలి కదా అందుకే నిన్న మిమ్మల్ని స్టేషనరీ షాప్ దగ్గర ఆపమన్నాను అంటుంది కృష్ణ. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందులో మంచి పెన్ ఉంటుంది. ఇది గ్రీన్ ఇంక్ పెన్ మీరు సంతకం పెట్టిన ప్రతిసారి నేను గుర్తుకు రావాలి అంటుంది కృష్ణ అప్పుడే అప్పగింతలు పెడుతున్నావా అంటూ బాధగా అడుగుతాడు మురారి. రేపు మాపో విడిపోతున్నట్లు ఇప్పటినుంచి ఎందుకు గుర్తు చేసుకోవటం అంటూ ఎమోషనల్ అవుతాడు.
టైం చూసి కంగారుపడిన కృష్ణ తొందరగా రెడీ అవ్వండి టైం అయిపోతుంది అనటంతో రెడీ అవ్వడానికి వెళ్తాడు మురారి. మరోవైపు రెడీ అవుతున్న ముకుంద మురారి ఎందుకు నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాడు, మురారి నాతో ఎందుకు టైం స్పెండ్ చేయట్లేదు. అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసిన కూడా తనతో ఉండడానికే ఇష్టపడుతున్నాడు. నాతో ఉంటేనే కదా నా ప్రేమ ఏంటో తెలిసేది. మురారి నాతోనే ఉండేలాగా ప్లాన్ చేయాలి అనుకుంటుంది.
మరోవైపు స్నానం చేసి వచ్చిన మురారి ని కూర్చోబెట్టి తల తుడుస్తున్నట్లు ఫీలవుతాడు మురారి. నాకు ఇలాంటి కలొచ్చిందేంటి నాకేమైంది అనుకుంటూ ఆఫీస్ కి రెడీ అవుతాడు. మరోవైపు కిచెన్ లోకి వచ్చిన ముకుందా అక్కడ ఉన్న రేవతిని చూసి మీకు ఓపిక లేదు కదా ఎందుకు కిచెన్ లోకి వచ్చారు అంటుంది. కృష్ణ కూరగాయలు కట్ చేసి ఇచ్చింది తనే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసింది అంటుంది రేవతి.
రంగంలోకి దిగింది అన్నమాట నాలుగు రోజులు హాస్పిటల్ కి లేటుగా వెళ్తే ఇల్లు కన్నా హాస్టల్ బెటర్ అనుకుంటుంది అప్పుడు తెలిసొస్తుంది తనకి అనుకుంటుంది ముకుంద. తరువాయి భాగంలో హాస్పిటల్ నుంచి ఎందుకు లేటుగా వచ్చావు అంటూ నిలదీస్తుంది రేవతి. సీనియర్స్ ని అడిగి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అవి తెలుసుకుంటున్నాను అంటుంది కృష్ణ. ఈ ఇంటి రూల్స్ ప్రకారం చీకటి పడేలోగా రావాలి అంటుంది భవాని. క్యాబ్స్ దొరకవు కదా అంటుంది కృష్ణ.
