బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన ముమైత్... అందరూ డిప్లమాటిక్‌గా ప్రవర్తించడం వల్లే తను సక్సెస్ కాలేదన్న ముమైత్..  వెళ్తూ హరితేజ పై ముమైత్  బిగ్ బాంబ్

ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ ఘట్టం ముగిసింది. ఇంటి నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గతంలోనూ ఒకసారి ముమైత్ ఎలిమినేట్ అవ్వగా.. బిగ్ బాస్ ఆమెను రెండు రోజుల పాటు సీక్రెట్ రూమ్ లో ఉంచి తిరిగి హౌజ్ లోకి పంపించారు. అయితే తిరిగి హౌజ్ లోకి వెళ్లిన తర్వాత ముమైత్ ప్రవర్తించిన తీరు అందరికి విసుగు తెప్పించింది. దానిని ఏ మాత్రం అంగీకరించని ప్రేక్షకులు ఈ వారం ఎట్టకేలకు ఎలిమినేట్ చేశారు.

బిగ్ బాస్ ఇంటి నుండి ఈ వారం ముమైత్, దీక్ష, అర్చనలో ఎవరు బయటకు వెళతారు అనే విషయమై.... జస్ట్ గెస్సింగ్ కోసం ఇంటి సభ్యులతో చీటీలు రాయించారు. అందులో కూడా చాలా మంది ముమైత్ పేరే రాయడం గమనార్హం.

గతంలో ఇంటి నుండి ఎవరైనా సభ్యులు ఎలిమినేట్ అయి బయటకు వెలుతుంటే.... అందరూ చాలా బాధ పడుతూ సాగనంపేవారు. అయితే ఈ సారి ముమైత్ వెలుతుంటే ఎవరిలోనూ పెద్దగా బాధ కనిపించలేదు. హ్యాపీగా ఆమెను సాగనంపారు.

నేను ఇంట్లోకి రెండోసారి చాలా రివేంజ్ ధోరణితో వెళ్లాను కానీ... ఇంట్లో అందరూ చాలా డిప్లమాటిక్‌గా ప్రవర్తించడం మొదలు పెట్టారని,అందుకే ఈ గేమ్ లో నేను సక్సెస్ కాలేక పోయానేమో అని ముమైత్ అభిప్రాయ పడ్డారు.

వెళుతూ వెళుతూ ముమైత్ తనకు దక్కిన బిగ్ బాంబ్ అవకాశాన్ని హరితేజ మీద వేసింది. దీని ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లో రూల్స్ బ్రేక్ అయినప్పుడల్లా, బిగ్ బాస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడల్లా పరుగుత్తుకుంటూ వెళ్లి ఆమె స్విమ్మింగ్ ఫూల్ లో దూకాలి. ఈ బాంబ్ వేసిన కొంతసేపటికే అర్చన అనుకోకుండా ఇంగ్లీషులో మాట్లాడి రూల్స్ బ్రేక్ చేయడంతో హరితేజ స్విమ్మింగ్ ఫూల్ లో దూకాల్సి వచ్చింది.

హౌజ్ ని వదిలి వెళుతున్న సమయంలో ముమైత్ కెప్టెన్ గా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అవ్వడంతో.. తదుపరి కెప్టెన్ కోసం పోటీ నిర్వహించనున్నారు. ఈ పోటీలో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నవదీప్, దీక్షలు పోటీ పడతారు.

ఇదిలా ఉండగా.. సోమవారం రానున్న ఎపిసోడ్ లో అర్చన్ కి దెయ్యం కనిపించినట్లు చూపించారు. మరి అది నిజమైన దెయ్యమో.. లేదా సరదాకి చేసిన ప్రయత్నమో ఈ రోజు ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది.

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->అర్జున్ రెడ్డి మీద ఆగ్రహం, సెన్సార్ బోర్డు ‘శవయాత్ర’