అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా త్వరలో చలన చిత్రం డాక్టర్ అబ్దుల్ కలామ్ అనే టైటిల్ తో రానున్న మూవీ మూవీలో అబ్దుల్ కలామ్ సాధించిన విజయాలు, స్పూర్తిగా నిలిచిన అంశాలు
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత విశేషాల ఆధారంగా 'డాక్టర్ అబ్దుల్ కలాం' అనే టైటిల్ తో త్వరలో ఓ చలన చిత్రం రానుంది. ఈ చిత్రానికి హీ డ్రెమ్ట్, హీ కాంకర్డ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. నిర్మాత అనిల్ సుంకర గత ఫిబ్రవరి లోనే రూపొందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరోసారి తాజాగా... ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేయించారు. అబ్ధుల్ కలాం జీవితంపై రాజ్ చెంగప్ప రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు సమాచారం.
అబ్దుల్ కలాం జీవితంపై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ లు తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కలాం బాల్యం మొదలు సాధించిన విజయాలు, పోక్రాన్ అణు బాంబు ప్రయోగం, సిఐఎని ఎలా ఫూల్ చేసింది, పేపర్ బాయ్ రాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగింది, ఆయన రాష్ట్ర పతిగా ఎలాంటి స్పూర్తినిచ్చారు.. మొదలైన స్పూర్తి దాయక విషయాలను చూపించనున్నారు.
