ఇండియన్ టెక్కీలకు షాక్: గ్రీన్ కార్డు కోసం 3 లక్షల మంది ఎదురుచూపు

More than three-fourths of Green card waiting list comprise of Indians: USCIS
Highlights

ఇండియన్ టెక్కీలకు ట్రంప్ షాక్

వాషింగ్టన్: అమెరికాలో  గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది.అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారిలో  ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారని  యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌  తాజాగా విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. మే2018 నాటికి సుమారు 3,95,025 మంది విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసమైన గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.


 వీరిలో మూడొంతులకు పైగా భారతీయులే ఉన్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సుమారు 3,06,601మంది భారతీయులు గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్‌
వెల్లడించింది.భారత్‌ తర్వాతి స్థానంలో చైనా నిలిచింది.   చైనాకు చెందిన 67,031 మంది గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన వారు పది వేలకు పైగా ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది.

అమెరికా సర్కార్ నిబంధనల ప్రకారంగా ఒక్క ఆర్ధిక సంవత్సరంలో ఏ దేశానికి కూడ ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులను జారీ చేయకూడదు. ఈ నిబంధన కారణంగా భారతీయ టెక్కీలు తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నిబంధన వల్లే వేలాది మంది ఇండియన్ టెక్కీలు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.

loader