నందమూరి వంశం నుంచి మరో వారసుడుగా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతుంది. నిజానికి ఇప్పటికే మోక్షజ్ఞ హీరోగా సినిమా రావాల్సి ఉన్నా ఎందుకో అది వెనక్కిపోతుంది. ఇక 2019లో మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ తీసే పనిలో ఉన్నాడు. ఆ సినిమాలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.

 

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో యువ బాలకృష్ణగా మోక్షజ్ఞ కనిపిస్తారట. దీనికి బాలయ్య కూడా ఓకే చేశారని టాక్. తేజ డైరక్షన్ లో తెరకెక్కబోతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో యువ బాలకృష్ణగా తన తెరంగేట్రం చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో కెమియో రోల్ మాత్రమే ఉంటుందని అంటున్నారు.

 

 

అసలు సినిమా 2019లోనే ఉంటుందట. సాయి కొర్రపాటి ఇప్పటికే తన నిర్మాణంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. అయితే దర్శకత్వం ఎవరు వహించాలని బాలయ్య ఆలోచిస్తున్న సమయంలో.. క్రిష్, తర్వాత పూరి ఇలా అందరితో చర్చలు జరుపుతున్నారు. మోక్షజ్ఞతో సినిమా చేసే దర్శకుడు ఎవరు అన్నది మాత్రం ఫైనల్ అవలేదు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తోనే తేజ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ వుంటుందని తెలుస్తోంది.

 

మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ లో కేమియో మాత్రమే కావటంతో మోక్షజ్ఞ కూడా తన ఫుల్ ప్లెడ్జ్ తొలి సినిమా మీద ఎక్సయిటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. బాలయ్య వారసుడిగా అంచనాలను అందుకునేలా సినిమాతో రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్ వచ్చి దుమ్ముదులిపేస్తుండగా రాబోతున్న మోక్షజ్ఞ మీద అందరి కన్ను ఉంది.