దివంగత నందమూరి తారకరామారావు కథతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాలన్.. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో కనిపించనుంది. అయితే ఈ బయోపిక్ లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా కనిపించానున్నాడని అంటున్నారు.

చాలా కాలంగా మోక్షజ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. బాలయ్య వందో సినిమా 'శాతకర్ణి'లో కూడా మోక్షజ్ఞ కనిపిస్తాడని అన్నారు కానీ అలా జరగలేదు. తనను ఇంప్రెస్ చేసే కథ కోసం ఎదురుచూస్తున్నాడు మోక్షజ్ఞ. క్రిష్ అటువంటి కథల కోసం వర్క్ చేస్తూనే ఉన్నాడు. దాదాపు క్రిష్ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈలోగా ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞను చూపించే ప్రయత్నం చేస్తున్నారని టాక్. కథ ప్రకారం సినిమాలో ఎన్టీఆర్ పాత్రను నాలుగు దశల్లో చూపించబోతున్నారు. 

బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్యవయస్కుడిగా ఆ పాత్ర కనిపించబోతుంది. అందులో కౌమార దశలో ఉన్న ఎన్టీఆర్ పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తాడని సమాచారం. తాత కథతో సినిమా చేయడం అందులో తండ్రి నటించడం.. అటువంటి సినిమాతో తన అరంగేట్రం చేయడం ఓ అరుదైన అవకాశంగా భావించిన మోక్షజ్ఞ ఎంట్రీకు సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. అయితే బాలయ్య మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని భావిస్తున్నాడు. ఇదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించాలని  భావిస్తున్నాడు.