తారలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డుల వేడుక సంతోషకరమైన వాతావరణంలో జరగాలి కానీ ఇలా ఆర్టిస్టులు వ్యతిరేకిస్తున్న వ్యక్తి సమక్షంలో అందులోనూ ఆయన ముఖ్య అతిథిగా అవార్డు తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించే సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడిగా మోహన్ లాల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల నటి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దిలీప్ ను అసోసియేషన్ నుండి నిషేదించిన సంగతి తెలిసిందే.
ఆయన్ను తిరిగి అసోసియేషన్ లో చేర్చుకోవాలనే నిర్ణయంపై విమర్శలు వినిపించాయి. కానీ మోహన్ లాల్.. దిలీప్ కు సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ఆర్టిస్టులు ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ప్రకటించే సినిమా అవార్డుల ఫంక్షన్ కు ఆయనను ఎట్టి పరిస్థితుల్లో హాజరుకానివ్వరాదు అంటూ నినాదాలు చేస్తున్నారు. దాదాపు వందకు పైగా సెలబ్రిటీలు మోహన్ లాల్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నేషనల్ అవార్డు దక్కించుకున్న దర్శకుడు బిజూ కుమార్ ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఓ నటికి అన్యాయం చేసిన నటుడికి ఆ గౌరవం ఇవ్వకూడదని ఆయన రాసుకొచ్చాడు. తారలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డుల వేడుక సంతోషకరమైన వాతావరణంలో జరగాలి కానీ ఇలా ఆర్టిస్టులు వ్యతిరేకిస్తున్న వ్యక్తి సమక్షంలో అందులోనూ ఆయన ముఖ్య అతిథిగా అవార్డు తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. నటుడు ప్రకాష్ రాజ్, మాధవన్, రాజీవ్ రవి, సచిదా నందన్, బినా పాల్, శృతి హరిహరన్ ఇలా చాలా మంది ఆయన చీఫ్ గెస్ట్ గా వ్యతిరేకిస్తారని టాక్.
