కన్నప్ప చిత్రం గురించి మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 1976లో లెజెండ్రీ నటుడు కృష్ణంరాజు భక్త కన్నప్ప చిత్రంలో నటించి సంచలనం సృష్టించారు. ఇన్నేళ్ల తర్వాత అదే కథాంశంతో, గ్రాండ్ విజువల్స్ తో మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం రాబోతోంది.  

మోహన్ లాల్ పై మంచు విష్ణు కామెంట్స్ 

ఈ చిత్రం గురించి మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్ ఇద్దరూ ఈ చిత్రం కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదట. 

ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు వెల్లడించారు. “ప్రభాస్, మోహన్‌లాల్ సర్ ఇద్దరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వారు ఈ ప్రాజెక్ట్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.” అని మంచు విష్ణు చెప్పారు. మోహన్ లాల్ సర్ చేసిన పనితో తాను ఆశ్చర్యానికి గురైనట్లు మంచు విష్ణు తెలిపారు. కనీసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసేందుకు కూడా ఆయన అంగీకరించలేదట. 

న్యూజిలాండ్ కి సొంత ఖర్చులతో.. 

సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లాల్సి వచ్చినప్పుడు, మోహన్‌లాల్ తనతో పాటు తన సిబ్బందికి సంబంధించిన ప్రయాణ ఖర్చులు కూడా స్వయంగా భరించారు. “మోహన్‌లాల్ సార్‌కు నేను మెసేజ్ పంపాను.. దయచేసి, మీ టికెట్లు మేమే బుక్ చేయాలనుకుంటున్నాం అని. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. తానే సొంత ఖర్చులతో వచ్చి కన్నప్ప చిత్రంలో నటిస్తానని చెప్పారు. ఇది మా నాన్నగారు మోహన్ బాబుకి మోహన్ లాల్ సార్ ఇచ్చే గౌరవానికి నిదర్శనం.” అని మంచు విష్ణు అన్నారు.

మోహన్ లాల్ పై ప్రశంసలు 

కన్నప్ప చిత్రం దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది అని సమాచారం. ఇంతటి భారీ ప్రాజెక్ట్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించడం అనేది మామూలు విషయం కాదు. మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలతో మోహన్ లాల్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ చిత్రంలో మోహన్‌లాల్ తో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘కన్నప్ప’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, మోహన్‌లాల్ గొప్ప మనసు చాటుకోవడం సినిమాకు మరింత పాజిటివ్ బజ్ తెచ్చిపెట్టింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది.