బిగ్ బాస్ కోసం ఏకంగా రూ.12 కోట్లు!

First Published 28, Jun 2018, 3:51 PM IST
mohan lal remuneration for big boss show
Highlights

రియాలిటీ షోలలో నెంబర్ వన్ గా నిలిచిన బిగ్ బాస్ షో ఉత్తరాది నుండి దక్షినాదికి కూడా పాకింది

రియాలిటీ షోలలో నెంబర్ వన్ గా నిలిచిన బిగ్ బాస్ షో ఉత్తరాది నుండి దక్షినాదికి కూడా పాకింది. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ఈ షోని ప్రసారం చేస్తున్నారు. తెలుగులో నాని హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, కన్నడలో సుదీప్, మరాఠీలో మహేష్ మంజ్రేకర్, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు.

ఇప్పుడు మలయాళంలో కూడా ఈ షో సిద్ధం కానుంది. దీనికి వ్యాఖ్యాతగా మోహన్ లాల్ వ్యవహరించనున్నారు. దీనికోసం ఆయన భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ షో కోసం ఆయనకు రూ.12 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు. గతంలో మోహన్ లాల్ 'లాల్ సలాం' అనే టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ షోకి మంచి రేటింగ్స్ వచ్చాయి.

దీంతో బిగ్ బాస్ కూడా ఆయనే హోస్ట్ చేస్తే బాగుంటుందని ఆయనను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. 16 మంది పోటీదారులతో వంద రోజుల పాటు ఈ షో సాగనుంది. పూనైలో బిగ్ బాస్ ఇంట్లో ఈ షోని నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ షో కూడా మొదలైంది. మరి మోహన్ లాల్ ఈ షోని ఏ స్థాయిలో హిట్ చేస్తాడో చూడాలి! 

loader