కన్నప్ప సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించారు మంచు మోహన్ బాబు. ఇటువంటి విషయాల్లో ఘటుగా స్పందించే స్టార్ నటుడు. ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా కామెంట్స్ చేశారు. ఇంతకీ మోహన్ బాబు ఏమన్నారంటే?
టాలీవుడ్ లో ఎక్కువ ట్రోలింగ్ కు గురయ్యే ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. వారు ఏ సినిమా చేసినా మీమ్స్ కామన్ గా కనిపిస్తుంటాయి. ఈక్రమంలో రీసెంట్ గా మంచు కుటుంబం నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ కన్నప్పపై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ట్రోలింగ్ పై ఫస్ట్ టైమ్ స్పందించారు మోహన్ బాబు.
కన్నప్ప సినిమాపై ట్రోలింగ్
మంచు విష్ణు హీరోగా నటించిన పౌరాణిక చిత్రం కన్నప్ప, జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది సినిమా. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ టీవీ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, ఈసినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా విడుదల అనంతరం మంచి స్పందన దక్కినప్పటికీ, కొన్ని సోషల్ మీడియాలో ఈ సినిమాపై ట్రోల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఈ విషయంపై తాజాగా స్పందించారు.
ట్రోలింగ్ పై స్పందించిన మోహన్ బాబు
కన్నప్ప విజయంపై మోహన్‌బాబు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో ఈ చిత్రంపై వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌పై ఆయన చాలా కూల్ గా స్పందించారు. ‘‘సినిమాకు విమర్శ – సద్విమర్శ, ప్రకృతి – వికృతి రెండు ఉంటాయి. ఒక గొప్ప పండితుడు, వేద శాస్త్రాల్లో నిష్ణాతుడు నాతో మాట్లాడుతూ ఇలా అన్నాడు – ‘మోహన్‌బాబుగారు, గత జన్మలో కానీ, ఈ జన్మలో కానీ మీరు తెలిసీ తెలియక చేసిన తప్పులకు ప్రతిఫలంగా ఈ విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శకులు మీ కర్మను తీసుకెళ్తున్నారు. కాబట్టి వారిని నిందించకుండా, వారిని ఆశీర్వదించండి,’ అన్నారు’’ అని మోహన్‌బాబు వెల్లడించారు.
తనపై విమర్శలు చేసిన వారిని తాను నిందించబోనని మోహన్‌బాబు స్పష్టం చేశారు. ఇక వారిని గురించి నేను ఏమీ మాట్లాడను. వారు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. విమర్శలను తాను దయతో స్వీకరిస్తున్నారని, వివాదాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారని మోహాన్ బాబు మాటలద్వారా అర్ధం అవుతుంది.
అందరిని ఆశ్చర్యపరిచిన మోహన్ బాబు
కన్నప్ప సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మోహన్‌బాబు. ఈసినిమా శివ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన devotional సినిమా. కన్నప్ప పాత్రలో మంచు విష్ణు, ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించగా, మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ విడుదల సమయంలోనే సినిమా పట్ల హైప్ పెరిగినప్పటికీ, విడుదల అనంతరం మిశ్రమ స్పందనతో పాటు ట్రోలింగ్ కూడా ఎదురవ్వడం గమనార్హం.
సీనియర్ నటుడిగా, పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవంతో ఉన్న మోహన్‌బాబు అంటే స్ట్రీక్ట్ అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. కొంత మంది ఆర్టిస్ట్ లు అయితే ఆయనతో మాట్లాడటానికి భయపడుతుంటారు. ఇటువంటి పరిణామాలపై మోహన్ బాబు ఎప్పుడు ఫైర్ అవుతుంటారు. చాలా ఘాటుగా స్పందిస్తుంటారు. మోహాన్ బాబుపై ఇలాంటి కాంట్రవర్సీలు ఎన్నో ఉన్నాయి. కాని ఈసారి మాత్రం ఆయన ఇంత ప్రశాంతంగా అనుభవంతో స్పందించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం కన్నప్ప 2nd వారంలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మరిన్ని కలెక్షన్లను రాబడుతూ, మంచి టాక్‌ను కొనసాగిస్తోంది.