క్రిస్మస్ సందర్భంగా మోహన్ బాబు ‘గాయత్రి’ ఫస్ట్ లుక్.. మళ్లీ వచ్చేశాడు

mohan babu gayathri first look revealed
Highlights

  • మోహన్ బాబు ప్రధాన పాత్రలో గాయత్రి
  • "ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే... నాదీ తప్పే" అంటున్న మోహన్ బాబు
  • క్రిస్ మస్ సందర్భంగా విడుదలైన మోహన్ బాబు గాయత్రి ఫస్ట్ లుక్

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాయత్రి' చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనది. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు పవర్ఫుల్ లుక్ విశేషంగా ఆకట్టుకోగా, పోస్టర్ పై ఉన్న కాప్షన్ "ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే" మరింత ఆసక్తిని రేపుతోంది. మోహన్ బాబు తన మైలురాయి చిత్రాలైన పెదరాయుడు మరియు రాయలసీమ రామన్న చౌదరి తరహాలో మరో శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. 'గాయత్రి' చిత్రంలో విష్ణు మంచు కూడా మరో పవర్ఫుల్ పాత్రలో నటించడం విశేషం. విష్ణుకు జోడిగా శ్రియ కనిపించనున్నారు.నిఖిలా విమల్ మోహన్ బాబు కూతురిగా టైటిల్ పాత్రలో నటించగా ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 9 ను విడుదల తేదీగా ఖరారు చేసిన 'గాయత్రి' చిత్రాన్ని మోహన్ బాబు తమ ప్రతిష్టాత్మక 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ పై నిర్మిస్తుండగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.
 

 

సాంకేతిక వర్గం: సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి, ఆర్ట్: చిన్న, ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్, నిర్మాత: డా. మోహన్ బాబు యమ్., దర్శకత్వం: మదన్ రామిగాని

loader