దాసరి ఇప్పటికీ సలహాలు ఇస్తున్నారు!

దాసరి ఇప్పటికీ సలహాలు ఇస్తున్నారు!

టాలీవుడ్ లో 150కి పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన ఘనత దర్శకరత్న దాసరి సొంతం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన ఈయన అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.

సినిమా ఇండస్ట్రీకు విశేష సేవలు అందించిన ఆయన గతేడాది మే ౩౦న అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటు. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఒంటి చేత్తో పరిష్కరించే దాసరి ఇక లేరు అనే విషయం బాధాకరం. ఎన్నడూలేని విధంగా ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో చాలా సమస్యలు తలెత్తాయి. ఈ కలహాలు చోటు చేసుకున్న సమయంలో దాసరి ఉంటే విషయం ఇంత దూరం వచ్చి ఉండేది కాదని ఆయన్ను తలుచుకున్న వారెందరో..

ఈరోజు దాసరి నారాయణరావు తొలి వర్ధంతి. ఆయన మనల్ని విడిచి సంవత్సరం పూర్తవుతున్న తరుణంలో ఆయన శిష్యుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ''మీరు మాకు దూరమై ఏడాది అయిందని ఎవరన్నారు..అనుక్షణం ఎదుటే ఉన్నారు.. కలలో ఉన్నారు.. సలహాలు ఇస్తున్నారు.. మా కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నారు.. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం..'' అని ఎమోషనల్ అయ్యారు. 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page