హీరోపై మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందా..?

modi government against to vishal's film
Highlights

తాజాగా కోలివుడ్ లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు తమిళ హీరో విశాల్ పై మోడీ ప్రభుత్వం 

తాజాగా కోలివుడ్ లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు తమిళ హీరో విశాల్ పై మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందా..? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గత కొంతకాలంలో తమిళనాడు రాజకీయాల్లో విశాల్ కలుగజేసుకుంటున్న సంగతి తెలిసిందే. మోడీ, భాజాపా పార్టీకు వ్యతిరేకంగా తమిళ ప్రజల కోసం పోరాడుతున్నాడు. కావేరీ జలాల విషయంలో కూడా మోడీ ప్రభుత్వంపై ఎదురుతిరిగాడు. అంతేకాదు డిల్లీకు వెళ్లి ఎన్డీయే గవర్నమెంట్ ను ప్రశ్నించాడు. ఈ విషయాలన్నీ మోడీకి, భాజాపాకు ఆగ్రహం తెప్పించేలా చేశాయి.

ఈ కారణంగానే విశాల్ నూతన చిత్రం 'ఇరుంబు తిరై'పై పరోక్షంగా పగ తీర్చుకుంటున్నారని కోలివుడ్ వర్గాలు ప్రచురిస్తున్నాయి. ఈ సినిమాలో మోడీ విధానాలకు వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. జీఎస్టీ, డిజిటల్ ఇండియా అంశాలను తప్పుబడుతూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సీన్స్ ఎడిట్ చేయాలని కేంద్రం కోరినప్పటికీ చిత్రబృందం లెక్కచేయలేదు. దీంతో విశాల్ పై దాడికి దిగారు కొందరు. చేసేదేమీ లేక విశాల్ పోలీసుల రక్షణ కోరాడు.  

loader