పదిహేడేళ్ల తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని భారత్ కు తెచ్చిన అందాల రాశి మానుషి షిల్లర్. మరి మానుషి పయనం బాలీవుడ్ వైపేనా అన్న ప్రశ్నకు సమాధానంగా తనకు సినిమాల్లోకి ఇప్పుడే వచ్చేయాలన్న కోరిక లేదని తెలిపింది. ఆమె మిస్ వరల్డ్ కీరిటం అందుకున్న వెంటనే భారతదేశమంతటా ప్రముఖులందరు ప్రశంసలను అందించారు.

 

తను సినిమాల్లో నటించడం మొదలుపెట్టాక ప్రతిసినిమాతో సమాజానికి ఏదో ఒక సందేశం ఇస్తానని తెలిపింది. సామాజిక సందేశాలతో తెరకెక్కే ఆమిర్ ఖాన్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అయితే సాధారణంగా ఫ్యాషన్ వరల్డ్ లో కీరిటాల్ని అందుకున్న వారు సినిమాల్లో నటించాలని అనుకుంటారు. కానీ మానుషి చిల్లర్‌ ఇంకా అలాంటి నిర్ణయం ఏమి తీసుకోలేదని చెప్పింది. ఆమిర్ ఖాన్ వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తాడని, అతను ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా చూసుకుంటాడని చెప్పింది.

 

ఇప్పటికే ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా లాంటి బ్యూటీ పాజెంట్స్ గెలిచిన బ్యూటీలు స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతున్నారు. మానుషి కూడా తనకు ఆమిర్‌ ఖాన్‌, ప్రియాంకచోప్రాలు తన అభిమాన నటీనటులని తెలిపింది.  మొత్తానికి బాలీవుడ్ లో మరో బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట.