Naatu Naatu song : బ్రిటీష్ కోటలో రామ్-భీమ్ ఆటా పాటా, మారువేశాల్లో బురిడీ? మైండ్ బ్లాకింగ్ డిటైల్స్!
'నాటు నాటు' లిరికల్ వీడియో విడుదల పోస్టర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. అలాగే ఈ పోస్టర్ ని గమనిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు మనకు అర్థం అవుతాయి.
ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్న రాజమౌళి, ప్రతి అప్డేట్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియోతో హిస్టారిక్ విజువల్ వండర్ గా ఆర్ ఆర్ ఆర్ ని Rajamouli తీర్చిదిద్దారని అర్థం అవుతుంది. మైండ్ బ్లాక్ చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ పై టాలీవుడ్ స్టార్ హీరోల నుండి సాంకేతిక నిపుణుల వరకు ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఆర్ ఆర్ ఆర్ నుండి సెకండ్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు టీం ప్రకటించింది. నాటు నాటు.. లిరికల్ సాంగ్ అక్టోబర్ 10న విడుదల కానుంది. అయితే 'నాటు నాటు' లిరికల్ వీడియో విడుదల పోస్టర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మైమరిచి... క్లాస్ డ్రెస్ లో, మాస్ స్టెప్స్ వేస్తున్న పోస్టర్ రచ్చ చేస్తుంది. 'Naatu Naatu' మాస్ బీట్ కి టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి డాన్స్ వేయనున్నారని క్లారిటీ ఇచ్చారు.
అలాగే ఈ పోస్టర్ ని గమనిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు మనకు అర్థం అవుతాయి. టక్ చేసుకొని, టై వేసుకొని, లెదర్ షూస్ ధరించి టోటల్ ఫార్మల్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపిస్తున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే బ్రిటిష్ లేడీస్ కనిపిస్తున్నారు. తెల్ల దొరలకు సంబంధించిన ఓ గ్రాండ్ పార్టీలో Ram charan, ఎన్టీఆర్ డాన్స్ చేసి.. వాళ్ళను ఎంటర్టైన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
బ్రిటీష్ వారంటే కత్తి దూసే రామ రాజు, భీమ్... వాళ్ళ పార్టీలో డాన్స్ వేయడం ఏమిటీ అనే సందేహం మనకు కలగవచ్చు. దీనికి సమాధానం... బ్రిటీష్ వాళ్ళను దెబ్బ తీసే క్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అనేక మారువేషాలు ధరిస్తారని, వాళ్ళను మోసం చేయడానికి అనేక ఎత్తులు, వ్యూహాలు రచిస్తారని సమాచారం. దానిలో భాగంగా బ్రిటీష్ ఎంపైర్ పై దాడి చేయడానికి వెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ ప్లాన్ లో భాగంగా ఇలా డాన్స్ చేసి ఉండవచ్చు.
Also read మైనర్ బాలిక రేప్ కేసు: ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ రద్దు.. మళ్ళీ జైలుకు
ఇక ఈ సాంగ్ నేపథ్యం ఏదైనా కానీ... రాజమౌళి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు ఒక పాటకు కలిసి డాన్స్ చేయడం కూడా ప్రత్యేకమైన అంశం. ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత కథల ఆధారంగా, ఫిక్షన్ జోడించి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా Ntr నటిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు.
Also read ఎన్టీఆర్ కుడిచేతికి గాయం, సర్జరీ.. ఫ్యాన్స్ లో కంగారు, అసలేం జరిగిందంటే..
డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తుండగా, ఆయన భార్య పాత్ర చేస్తున్నారు శ్రీయా శరణ్.