Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలిక రేప్ కేసు: ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ రద్దు.. మళ్ళీ జైలుకు

Tik tok యాప్ లో కామెడీ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఫన్ బకెట్ భార్గవ్... అనంతరం,యూట్యూబ్  ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది. 

minor girl rape case tik tok bhargav bail cancels pocso court
Author
Hyderabad, First Published Nov 6, 2021, 8:51 AM IST

టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ రద్దయినట్లు సమాచారం అందుతుంది. ఆయనకు మరోసారి పోక్సో కోర్టు రిమాండ్ విధించింది. దీంతో Bharagav ని అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం కలదు. మైనర్ బాలికపై అత్యాచారం, గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై ఫన్ బకెట్ భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, దాదాపు మూడు నెలలు జైలులో గడిపాడు. బెయిల్ పై విడుదలైన భార్గవ్ కి, మరలా  జైలు జీవితం తప్పేలా లేదు. 
 

Tik tok యాప్ లో కామెడీ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఫన్ బకెట్ భార్గవ్... అనంతరం,యూట్యూబ్  ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది. విశాఖకు చెందిన 14ఏళ్ల మైనర్ బాలిక భార్గవ్ వీడియోల పట్ల ఆకర్షితురాలు అయ్యారు. ఆమెకు కూడా టిక్ టాక్ వీడియోలు చేసే అలవాటు ఉన్న నేపథ్యంలో, భార్గవ్ ని కలవడం జరిగింది. 

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న బాలిక వీక్ నెస్ వాడుకొని భార్గవ్, ఆమెను లైంగికంగా వాడుకోవడం జరిగింది. తండ్రి లేని ఆ బాలిక తల్లితో ఒంటరిగా ఉండడం వలన పూర్తి స్వేచ్ఛ దొరకడంతో తరచూ భార్గవ్ ని కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో పలుమార్లు భార్గవ్,బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక నాలుగు నెలల గర్భవతి అని తెలుసుకున్న తల్లి, ఆరా తీయగా, అసలు విషయం బయటికి వచ్చింది. ఏప్రిల్ 16న పెందుర్తి పోలీస్ స్టేషన్ లో భార్గవ్ పై ఆమె కంప్లైంట్ చేశారు. 


ఏప్రిల్ 18వ తేదీన భార్గవ్ ని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసును దిశా పోలీస్ స్టేషన్ కి ట్రాన్ఫర్ చేశారు. భార్గవ్ పై పోక్సో చట్టంతో పాటు, పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసి, రిమాండ్ కి తరలించడం జరిగింది. 94 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న భార్గవ్ జులై 19న బెయిల్ పై విడుదల కావడం జరిగింది. జైలు నుండి వచ్చిన భార్గవ్, సోషల్ మీడియా వేదికగా తాను నిర్దోషిని అని చెప్పే ప్రయత్నం చేశారు. నెటిజెన్స్ మాత్రం అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ కేసులో షరతులతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. బెయిల్ పై బయటకు వచ్చాక, బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్.

దీంతో భార్గవ్ పై మెమో ఫైల్ చేశారు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమో లో పొందుపరిచారు పోలీసులు. దీంతో బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకూ రిమాండ్ విధించింది పోక్సో కోర్టు. రిమాండ్‌ లో భాగంగా ఫన్ బకెట్ భార్గవ్ ను సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.

 Also read Bigg Boss Telugu 5; దీప్తి-షణ్ముఖ్ ల సీక్రెట్‌ రివీల్‌ చేసిన సిరి.. పబ్లిక్ గా ప్రేమించుకున్న మానస్‌, ప్రియాంక
ప్రస్తుతం గతంలో వలె కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న భార్గవ్ బెయిల్ రద్దు కావడంతో, అతడు జైలుకు వెళ్ళాడు. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి, గర్భవతిని చేసిన భార్గవ్ పై సోషల్ మీడియాలో పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నటుడిగా మంచి భవిష్యత్ ఉన్న భార్గవ్, క్షమించరాని నేరానికి పాల్పడి, జీవితం నాశనం చేసుకున్నాడు. 

Also read RRR Big update: `నాటు నాటు` అంటోన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. `ఆర్ఆర్ఆర్‌` సెకండ్‌ సింగిల్‌

Follow Us:
Download App:
  • android
  • ios