Mirai Actor: ప్రముఖ నటుడు కన్నుమూశారు. `మిరాయ్‌` చిత్రంలో నటించిన నేపాలీ నటుడు సునీల్‌ థాపా తుదిశ్వాస విడిచారు. హార్ట్ ఎటాక్‌కి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. 

`మిరాయ్‌` నటుడు కన్నుమూత 

తేజ సజ్జా నటించిన `మిరాయ్‌` మూవీలో కీలక పాత్రలో నటించిన నేపాలీ నటుడు సునీల్‌ థాపా(68) కన్నుమూశారు. హార్ట్ఎటాక్‌కి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఖాట్మాండ్‌ ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆయనకు సంతాపం తెలియజేసింది. `మిరాయ్‌` మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌ మూవీతో కెరీర్‌ ప్రారంభించిన సునీల్‌ థాపా

సునీల్‌ థాపా తన 40ఏళ్ల కెరీరలో 300లకుపైగా చిత్రాల్లో నటించాడు. తెలుగులో `మిరాయ్‌`తోపాటు బాలీవుడ్‌ `మేరీకోమ్‌` వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, నేపాలీ, భోజ్‌పురి భాషల్లో ఆయన సినిమాలు చేశారు. సునీల్‌ థాపా హిందీ ఫిల్మ్ `ఏక్‌ దుజే కే లియే` (1981) చిత్రంతో నటుడిగా మారారు. హిందీ సినిమాలతో పాపులర్‌ అయి, ఆ తర్వాత నేపాలీ చిత్రాల్లో వరుసగా అవకాశాలు అందుకున్నారు. స్టార్‌ యాక్టర్‌గా రాణించారు. సునీల్‌ థాపా నటుడిగా అనేక అవార్డులు అందుకున్నారు.

Scroll to load tweet…