'మీటూ' ఉద్యమం రోజురోజుకి రాజుకుంటుంది. హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం తనుశ్రీ దత్తా, నానా పటేకర్ ఉదంతంతో బాలీవుడ్ కి పాకింది. ఇప్పుడు ఈ ఉద్యమం తెలుగు చలన చిత్ర పరిశ్రమని హడలెత్తించడానికి సిద్ధమవుతోంది. 

'మీటూ' ఉద్యమం రోజురోజుకి రాజుకుంటుంది. హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం తనుశ్రీ దత్తా, నానా పటేకర్ ఉదంతంతో బాలీవుడ్ కి పాకింది. ఇప్పుడు ఈ ఉద్యమం తెలుగు చలన చిత్ర పరిశ్రమని హడలెత్తించడానికి సిద్ధమవుతోంది.

ఇండస్ట్రీలో నటులు, దర్శకులు, నిర్మాతలు తమపై జరిపిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడానికి మహిళా నటీమణులు సిద్ధమవుతున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన కార్యాచరణ జరుగుతోంది.

నటీమణులు కొందరు సాంకేతిక నిపుణులు తమపై జరిగిన వేధింపుల గురించి ఎలా బయటపెట్టాలనే విషయంపై మాట్లాడడానికి యాంకర్ సుమ, మరో యాంకర్ ఝాన్సీ, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫిలిం ఛాంబర్ లో సుమ కనకాల నేతృత్వంలో సాగుతోన్న ఈ సమావేశంలో ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ ని చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరణించిన నటులు, దర్శకులు, నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయకూడదని నిబంధన పెట్టుకున్నట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తులు సమాధానాలు చెప్పలేరు కాబట్టి వారిపై ఆరోపణలు చేయడం సరికాదని భావిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్గతంగా జరిగిన వ్యవహారాల గురించి బయటపెట్టడానికి బయపడ్డ వారికి ఇప్పుడు ఈ కమిటీ 
ద్వారా బయటపెట్టే ఛాన్స్ వస్తుంది. అయితే ఎంతమంది బయటకి వచ్చి బహిరంగంగా నిజాలు చెబుతారనేది చూడాలి! 

సంబంధిత వార్తలు.. 

నా ఫ్యాంట్ కిందకి లాగేసి మీద పడి.. నటి ఆవేదన!

లైంగిక ఆరోపణలతో అనారోగ్యం బారిన పడ్డ నటుడు!

‘‘రేప్ జరిగిందేమో.. కానీ నేను చేయలేదు’’

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

బడా డైరెక్టర్ పై అత్యాచారం ఆరోపణలు!