తను శ్రీ - నానా పటేకర్ వివాదం ఒక కొలిక్కి రాకముందే ప్రముఖ దర్శకుడు సుభాష్ పేరు కూడా బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.  

బాలీవుడ్ లో వేధింపులకు సంబందించిన న్యూస్ రోజు ఎదో ఒకటి వైరల్ అవుతూనే ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ లో పలువురు నటీమణులు సీనియర్ దర్శకులపై నటులపై ఆరోపణలు చేస్తుండడం నేషనల్ మీడియాలలో చర్చనీయాంశంగా మారింది. తను శ్రీ - నానా పటేకర్ వివాదం ఒక కొలిక్కి రాకముందే ప్రముఖ దర్శకుడు సుభాష్ పేరు కూడా బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. 

‘ఖల్‌నాయక్‌ - రామ్‌ లఖాన్‌ అలాగే పర్దేస్‌ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సుభాష్ ఘయ్ పై ఇప్పుడు లైంగికపరమైన ఆరోపణలు వస్తున్నాయి. పేరు చెప్పకుండా ఒక మహిళ సుభాష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ డిస్కషన్ కోసమని సుభాష్ నన్ను ఆఫీస్ కి పిలిచి కూల్ డ్రింక్ లో మత్తు మంది కలిపి స్పృహ కోల్పోయిన తరువాత అత్యాచారం చేసినట్లు ఆమె తెలిపింది. 

=అదే విధంగా ఈ విషయం గురించి బయటకు చెబితే జీతం డబ్బులు రాకుండా చేస్తానని అతను బెదిరించడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా జరిగిన ఘటన గురించి బయటకు చెప్పలేదని ఆమె వివరించింది. దీంతో ఆ ఆరోపణలను సుభాష్ ఖండించారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అలాంటి చర్యలకు పాల్పడటం నిజమే అయితే కోర్టుకు వెళ్లి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువునష్టం దావా వేయాల్సి ఉంటుందని చెబుతూ.. ఉన్నత వ్యక్తులపై ఈ విధంగా ఆరోపణలు చేయడం అందరికి ఒక ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు