మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన మేఘా ఆకాష్

First Published 9, Apr 2018, 3:55 PM IST
Megha to romance sai dharam tej
Highlights
సాయిధరమ్ తేజ్ సినిమా లో మేఘా

లై,  చల్ మోహనరంగలో నితిన్ తో ఆడిపాడిన హీరొయిన్ మేఘా ఆకాష్ కు అవకాశాలు మెల్లగా వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదటి సినిమా 'లై' హీరో నితిన్ విలన్ అర్జున్ చుట్టే తిరిగే కథ కావడంతో తన నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. కాని చల్ మోహన్ రంగాలో హీరోతో సమానంగా కథలో జర్నీ చేసే పాత్ర కావడంతో మేఘా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇప్పుడు ఈమెకు ఒక మెగా ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

వరుస పరాజయాలతో కెరీర్ ఢీలా పడ్డ హీరో సాయి ధరం తేజ్.  'ఉన్నది ఒకటే జిందగీ'తో గత ఏడాది పర్వాలేదు అనిపించుకున్న దర్శకుడు తిరుమల కిషోర్ చేయబోయే మూవీకి హీరొయిన్ గా మేఘా ఆకాష్ పేరే ఉందని ఇన్ సైడ్ టాక్. నేను శైలజతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిషోర్ తిరుమల ఆ స్థాయి మేజిక్ మళ్ళి రెండో సినిమాలో రిపీట్ చేయలేకపోయాడు. అందుకే సాయి ధరం తేజ్ ను ఇంప్రెస్ చేసే స్క్రిప్ట్ తో వర్క్ అవుట్ చేసినట్టు టాక్. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్టు తెలిసింది. తీసిన మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అయిన మైత్రి బ్యానర్ అంటే హీరో హీరొయిన్లు లక్కీగా ఫీలవుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కనక ఓకే అయితే ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న సాయి ధరం తేజ్ కు దాని తర్వాత మూవీ ఇదే అవుతుంది.

loader