సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతున్న మెగా స్టార్ మూవీ యూరోప్ నుంచి సాంగ్ షూట్ పూర్తి చేసుకుని వచ్చిన టీం
చెప్పిన డేట్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చకాచకా కానిచ్చేస్తున్నాడు చిరు. వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఖైదీ నెంబర్ 150 చిత్రం రెండు పాటల కోసం ఈరోప్ వెళ్లింది. చిరు అండ్ కాజల్ అందమైన లోకేషన్స్ లో చిందేశారు. ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ కూడా నెట్ లో సందడి చేసాయి. సోషల్ నెట్ వర్క్ ద్వారా కాజల్ తన ఖైధీ ఫోటోలను లీక్ చేసింది.
సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది చిరు 150వ చిత్రం. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ కత్తి సినిమాకు అఫీసియల్ రీమేక్ గా చిరు కొత్త చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు ధృవ సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తూనే.. మరోవైపు నాన్న సినిమాను సంక్రాంతి కి విడుదల చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు.
రీసెంట్ గా ధృవకు సంబంధించిన లాస్ట్ సాంగ్ ను కంప్లీట్ చేసే పని ఉన్నా.. చిరు సినిమా కోసం ఈరోప్ వెళ్లలేకపోయాడు రామ్ చరణ్. సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోన్న చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత తన తమ్ముడిని ఈరోప్ షెడ్యూల్ లో మిస్ అయ్యాననీ చెప్పుకొచ్చింది. సినిమాకు దేవిశ్రీ అద్భుతమైన పాటలు ఇచ్చాడని ... దేవి ట్యూన్స్ కి ఏమాత్రం తగ్గకుండా చిరు స్టెప్పులేసాడట.
