- Home
- Entertainment
- Mahesh Babu: కృష్ణ గారి అబ్బాయి అని మాత్రమే తెలుసు, చంద్రమోహన్ హీరోయిన్ ని పిలిచి మరీ తిట్టిన మహేష్ బాబు
Mahesh Babu: కృష్ణ గారి అబ్బాయి అని మాత్రమే తెలుసు, చంద్రమోహన్ హీరోయిన్ ని పిలిచి మరీ తిట్టిన మహేష్ బాబు
సీనియర్ నటి టి.రామేశ్వరి మహేష్ బాబుని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు నిజం మూవీ షూటింగ్ లో తనని తిట్టారని రామేశ్వరి తెలిపారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహేష్ బాబు నిజం మూవీ
సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సందేశాత్మక చిత్రాల లిస్ట్ తీస్తే నిజం మూవీ కూడానా ఉంటుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సమాజంలో జరిగే అవినీతికి వ్యతిరేకంగా రూపొందించబడింది. కానీ కమర్షియల్ గా ఈ మూవీ డిజాస్టర్. ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో మహేష్ బాబు తల్లిదండ్రులుగా రంగనాథ్, అలనాటి నటి టి రామేశ్వరి నటించారు.
సీనియర్ నటి రామేశ్వరి
నటి రామేశ్వరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజం మూవీ విశేషాలు గుర్తు చేసుకున్నారు. నటి రామేశ్వరి 70, 80 దశకాల్లో హిందీలో నటిగా రాణించారు. తెలుగు లో ఆమె నటించిన హిట్ సినిమాల్లో సీతామాలక్ష్మి ఒకటి. ఈ చిత్రంలో ఆమె చంద్రమోహన్ కి హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం గుర్తుకు వచ్చే డైరెక్టర్ తేజ రామేశ్వరికి నిజం మూవీలో ఆఫర్ ఇచ్చారట.
రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదు
తేజ గారు ఫోన్ చేసి ఒక కథ ఉంది మీరు వస్తే చెబుతాను అని అన్నారు. ఆయనే టికెట్ బుక్ చేశారు. వెళ్లి కథ విన్నాను. హీరో ఎవరనే విషయం నాకు తెలియదు. నా పాత్ర ఏంటి అనేదే నాకు ముఖ్యం. కథ నచ్చింది. రెమ్యునరేషన్ ఎంత కావాలి అని అడిగారు. నేను డిమాండ్ చేయలేదు. వాళ్ళు ఇచ్చినంతే తీసుకున్నాను. ఆ తర్వాత మహేష్ బాబు హీరో అని చెప్పారు.
మహేష్ బాబు ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడు
మహేష్ బాబు అంటే ఎవరో ఆ టైం నాకు నిజంగా తెలియదు. కృష్ణ గారి అబ్బాయి అంటే మాత్రం తెలుసు. మహేష్ ఎలాంటి సినిమాల్లో నటించాడు ? ఎంత పెద్ద నటుడు అనేది నాకు తెలియదు. షూటింగ్ జరుగుతున్న సమయంలో నా రెమ్యునరేషన్ గురించి మహేష్ బాబుకి తెలిసింది. మహేష్ నన్ను పిలిచి ఇంత తక్కువ రెమ్యునరేషన్ కి ఎందుకు ఒప్పుకున్నారు అని నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడు. మీరు ఇంకా ఎక్కువ డిమాండ్ చేసి ఉండాల్సింది అని అన్నాడు.
జయసుధ రిజెక్ట్ చేసింది
ఆ పాత్రకి అంతకు ముందు జయసుధ, రేఖ లాంటి వారిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి అని రామేశ్వరి పేర్కొన్నారు. ఆ పాత్రలో ఫిజికల్ గా ఎక్కువ కష్టం ఉంటుంది. అందుకని జయసుధ అంగీకరించలేదట. షూటింగ్ జరిగేటప్పుడు.. ఈ సినిమా తర్వాత మీకు క్షణం కూడా ఖాళీగా ఉండరు. బోలెడన్ని ఆఫర్స్ వస్తాయి చూడండి అని డైరెక్టర్ తేజ అన్నారు. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం పక్కన పెడితే డైరెక్టర్ తేజనే ఇంకెప్పుడూ తనకి ఛాన్స్ ఇవ్వలేదని రామేశ్వరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

