సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం పెద్ద ఎత్తున పవన్ కు విషెస్ తెలుపుతున్నారు.
సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం పెద్ద ఎత్తున పవన్ కు విషెస్ తెలుపుతున్నారు.
సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. బాబాయ్ కి సర్ప్రైజ్ అంటూ ఇప్పటికే రామ్ చరణ్ పారా గ్లైడింగ్ చేసిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు. అలానే పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
''కళ్యాణ్ బాబు.. నువ్వు అందుబాటులో లేవని తెలిసింది. కలవాలని అనుకొని విరమించాను. పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆ హనుమాన్ నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను'' అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొణిదల ప్రొడక్షన్ కంపెనీ ప్రత్యేకంగా పవన్ బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
తెలుగు ప్రజలు ఆరాధించే పవర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు!