కేరళకు సైరా నరసింహారెడ్డి.. మార్చిదాకా షూటింగ్ లేనట్టే..!

First Published 4, Jan 2018, 3:00 PM IST
megastar chiranjeevi syeraa shooting second schedule in pollachi kerala
Highlights
  • ఇటీవలే ప్రారంభమైన చిరు సైరా నరసింహారెడ్డి షూటింగ్
  • హైదరాబాద్ లో వేసిన సెట్ లో సైరా తొలి షెడ్యూల్ పూర్తి
  • రెండో షెడ్యూల్ కోసం కేరళ వెళ్తున్న సైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం షూటింగ్ వాయిదాల అనంతరం ఎట్టకేలకు డిసెంబర్ ఫస్ట్ హాఫ్ లో మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ సైరాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

డిసెంబరులో ప్రారంభమైన ఈ షూటింగ్ హైదరాబాద్‌లో పదిరోజుల పాటు షూటింగ్‌ సాగింది. ఇందులో భాగంగా కొన్ని యాక్షన్‌ సీన్స్ తెరకెక్కించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ‘సైరా’కి సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. షూటింగ్‌ మళ్లీ మార్చి దాకా వాయిదా వేశారు. ఈసారి చిత్రబృందం కేరళలోని పొల్లాచ్చి వెళ్లబోతోంది. అక్కడ రెండు వారాల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

 

తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

loader