Asianet News TeluguAsianet News Telugu

Chiranjeevi : భార్యతో మెగాస్టార్ టూర్.. ‘వాలెంటైన్స్ డే’ రోజును చిరు దంపతులు ఎలా ప్లాన్ చేశారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాలెంటైన్స్ డే రోజును స్పెషల్ గా ప్లాన్ చేశారు. భార్యతో కలిసి సెల్ఫీ దిగుతూ తన అభిమానులతో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. 

Megastar Chiranjeevi Special Post on Valentines Day 2024 NSK
Author
First Published Feb 14, 2024, 1:08 PM IST | Last Updated Feb 14, 2024, 1:09 PM IST

మెగా స్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇటు కెరీయర్, అటు ఫ్యామిలీతో క్వాలిటీ సమయం గడుపుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు కుటుంబంలో జరిగే అన్ని ఫంక్షన్లకు పెద్దగా నిలుస్తూ ఆకట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా వాలెంటైన్స్ డే Valentines Day సందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ న్యూస్ చెప్పారు. 

భార్య సురేఖ కొణిదెలతో కలిసి టూర్ ప్లాన్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు. ‘నా బెటర్ హాఫ్ సురేఖతో ఒక చిన్న సెలవు కోసం USAకి బయలుదేరాను. నేను తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభర చిత్రీకరణను పునఃప్రారంభిస్తాను! మీ అందరినీ త్వరలో కలుస్తాను. అలాగే అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భార్యతో క్యూట్ సెల్ఫీ దిగారు. ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఆ ఫొటోను పంచుకున్నారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘విశ్వంభర’ Vishwambhara చిత్రంపైనా అప్డేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు శరవేగంగా షూటింగ్ జరగ్గా..  చిరు హాలీడే ట్రిప్ తో కాస్తా బ్రేక్ పడింది. మళ్లీ తను వచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభించనున్నట్టు మెగాస్టార్ చెప్పుకొచ్చారు. సోషియో ఫాంటసీ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2025 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios