మెగా ఫ్యాన్స్ ను నిరాశ పరచిన ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులలకు నిరాశ ఆడియో వేడుక బదులు జనవరి ఫస్ట్ వీక్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 25న విజయవాడలో నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఖైదీ నెం 150 ఆడియోను ఘనంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే...కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేసారు. ఈనెల 25న ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జనవరి ఫస్ట్ వీక్ లో భారీ స్ధాయిలో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రేపు అంటే 18న సాయంత్రం ఖైదీ నెం 150 మూవీలోని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
